శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0030 నామం : కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా
"ఓం కామేశబద్ధమాంగళ్యసూత్రశోభిత కంధరాయై నమః"
భాష్యం
అంగదము అంటే భుజమున ధరించే ఆభరణము. కేయూరము భుజము పైన అంటే చేతి మొదలు నందు ధరించే ఆభరణము భుజకీర్తి. నిజానికి అంగదము, కేయూరము అనే రెండు పదాలు ఒకే అర్థాన్ని చెబుతాయి అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెబుతోంది. అంగదములు, కేయూరములు అనే ఆభరణాలను భుజములందు ధరించినది బ్రహ్మోత్తర ఖండంలోని శివధ్యాన ప్రకరణంలో
దధానం నాగవలయకేయూరాంగదముద్రితా అని చెప్పబడింది. అంటే నాగవలయము, కేయూరము, అంగదము, ముద్రికలను ధరించినది. అలాగే
కేయూరాంగదహారకంకణముఖాలంకారవిగభ్రాజితా అన్నారు. అంటే కేయూరము, అంగదము, హారము, కంకణము మొదలైన ఆభరణములచే ప్రకాశించునది. అగ్నిపురాణంలో కేయూరములు, అంగదములు అని చెప్పబడింది.
బంగారముతో చేయబడిన కేయూరములు, అంగదములు ధరించి ప్రకాశించు భుజములు గలది.
దుర్వాసులవారు శ్రీదేవి మహిమ్మః స్తుతిలోని 34వ శ్లోకంలో ఆ దేవిని స్తుతిస్తూ
ముక్తారత్న విచిత్ర కాంతి లలితై స్తే బాహువల్లీ రహం
కేయూరాంగద బాహుదండ వలయై క్పస్తాంగులీభూషణైః ॥
ఓ తల్లీ ! నీ చేతులు ముత్యాలు రత్నాలు పొదగబడిన చిత్రవిచిత్ర కాంతులతో ప్రకాశిస్తున్న మణికట్టు, మోచేయి, భుజములమీద ధరించు ఆభరణములచేత వ్రేళ్ళ ఉంగరాల చేత ప్రకాశిస్తున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below