శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0030 నామం : కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా
"ఓం కామేశబద్ధమాంగళ్యసూత్రశోభిత కంధరాయై నమః"
స్త్రీకి ఎన్ని ఆభరణాలున్నా రాని అందం మంగళసూత్రంతో వస్తుంది. కామేశ్వరుడు అమ్మవారి భర్త. ఆయన అమ్మ మెడలో మంగళసూత్రం కట్టాడు. ఆ మంగళసూత్రంతో అమ్మవారి మెడ శోభిస్తుంది. ఈ మంగళసూత్ర ప్రభావం వల్లే కామేశ్వరుడు లోకపాలకుడై చిరంజీవియై ఉన్నాడు. శ్రీమద్భాగవత మహాపురాణాన్ని శుకుడు పరీక్షిత్ కి చెప్పిన విషయం అందరూ ఎఱిగినదే. క్షీరసాగర మదన సమయంలో ముందుగా విషం పుట్టింది. ఆవిషయాన్ని దేవదానవులు శివుడిని త్రాగమని లోకాలను రక్షించమని కోరారు. శివుడు త్రాగడానికి సిద్దమయ్యాడు. కథ వింటున్న పరీక్షిత్ శుకుడిని ఇలా ప్రశ్నించాడు. ఏ స్త్రీ అయినా చూస్తూ చూస్తూ తన భర్తని విషం త్రాగమంటుందా? పార్వతి శివుడిని విషం త్రాగమని ఎలా ప్రోత్సహించింది? అప్పుడు సమాధానంగా శుకుడు ఇలా అంటాడు. మ్రింగేవాడు భర్త అని, మ్రింగేది విషమని తెలిసినా లోకశ్రేయస్సు కోసం సర్వమంగళ పార్వతి శివుడిని విషం త్రాగమన్నది. మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో? అంతరార్ధం - తన మంగళసూత్ర బలమే శివుడికి రక్ష అని పార్వతి భావించిందన్నమాట. అమ్మలగన్నయమ్మ శ్రీలలితా మాత మాంగళ్యబలంతో కామేశ్వరుడు లోకపాలకుడయ్యాడు.
మంత్రప్రయోగం ఫలితం
ఈమంత్రాన్ని భక్తితో జపిస్తే జపించే స్త్రీలకూ వైధవ్యం రాదు. పుణ్యస్త్రీగా సౌభాగ్యంతో శరీరం చాలించాలనుకునే స్త్రీలు నిత్యం పడుకోబోయే ముందు ఈమంత్రాన్ని 9 సార్లు జపించాలి. విధవలు నిద్రించేముందు
"ఓం కామేశబద్ధమాంగళ్యసూత్రశోభిత కంధరాయై నమః"
అనే ఈమంత్రాన్ని 11 సార్లు జపిస్తే మరేజన్మలోనూ వైధవ్యం రాదు. పురుషులు ఈమంత్రాన్ని నిద్రించేముందు 27 సార్లు జపిస్తే భార్యతో తగాదాలు ఉండవు. భార్య అనుకూలవతి అవుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0031 నామం : కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation