శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0029 నామం : అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా
"ఓం అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజితాయై నమః"
చిబుకము అన్నా చుబుకం అన్నా గడ్డం అని అర్థం. అమ్మవారి గడ్డం అందంగా ఉంది. ఆ గడ్డాన్ని దేనితో పోల్చలేము. అందమైన వస్తువులను మరొక అందమైన వస్తువుతో పోల్చి చెప్పడం కవి లక్షణం, కానీ ఏ కవిత్వానికి అందని, ఏవస్తువు తోటీ పోల్చలేని మహాద్భుత సౌందర్యం అమ్మవారి గడ్డానికి ఉంది. ఆ గడ్డం నుండి వచ్చే కాంతిని కొంచెం స్వీకరించి రవి చంద్రాది గ్రహాలు వెలుగుతున్నాయి. నక్షత్రాలు శోభిల్లుతున్నాయి. కామేశ్వరుడా గడ్డపు సొగసుకు లొంగి అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. ఇటువంటి ఈ గడ్డాన్ని ధ్యానిస్తే సౌందర్యం వృద్ధి అవుతుంది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజితాయై నమః"
స్త్రీలైనా పురుషులైనా శరీరం అందంగా ఉంచుకొని, అందరికీ ఆకర్షణీయంగా కనబడడానికి కోరుకోవడం సహజం. అందం పుట్టుకతో వచ్చేది. అలంకరణ ద్వారా కొంత వరకు పెంచుకోవచ్చు. కానీ లేనిది రమ్మన్నా రాదు కదా! "ఓం అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజితాయై నమః" అనే మంత్రాన్ని రోజు 27 సార్లు జపిస్తే మనుష్యులకు ఆకర్షణ కలిగించే శరీరాకృతి వస్తుంది. ఈ మంత్రధ్యానం వలన దమయంతి నలుడిని ఆకర్షించింది. వికారాకారం వలన పెళ్లి కాక బాధపడే స్త్రీ పురుషులు ఒక సంవత్సరం పాటు ఈమంత్రాన్ని 108 సార్లు జపిస్తే అపూర్వ ఆకర్షణ వారికి వస్తుంది. దానివల్ల కళ్యాణం అవుతుంది. మనస్సు ఈర్ష్యాసూయదులతో నిండిపోవడం వల్ల మానసిక వికారం వస్తుంది. ఈమంత్రాన్ని భక్తితో యథాశక్తి జపిస్తే వికారాలు పోయి, మనశ్శుద్ధి వస్తుంది. దానివల్ల పవిత్రత లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0030 నామం : కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation