శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0028 నామం : మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా
"ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మనసాయై నమః"
అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వనే కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు ఓలలాడుతోంది. అనగా అమ్మవారి చిరునవ్వు కామేశ్వరుడిని ఆకర్షించి తనవైపునకు తిప్పుకుందన్నమాట. సమస్తమైన కోర్కెలకు అధిపతి కామేశ్వరుడు. కోర్కెలను అదుపులో పెట్టేవాడు , తీర్చేవాడు ఆయనే. అయన మనస్సు నుండి పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు తయారయ్యాయి. అందుకే మన శరీరాలను పాంచభౌతిక శరీరాలంటారు. ఇవన్నీ నశించిపోయేవే. శరీరం అనగా శీర్యతే ఇతి శరీరం అనే నిర్వచనాన్ని బట్టి నశించిపోయేది లేక జీర్ణమైపోయేది చిట్టచివరి కోర్కెలన్నీ పతనానికి దారితీస్తాయని పురాణేతిహాసాలు అంటున్నాయి. అమ్మవారి చిరునవ్వు అనేక విధాలైన కోర్కెలను అదుపులో పెడుతుందని అంతరార్ధం. అవసరమూ ప్రమాదకరమూ అయిన కోర్కెలను కావాలని వ్యవహరిస్తాం. వీటిని తనవైపు త్రిప్పుకునేది అమ్మవారే.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మనసాయై నమః"
ఉద్యోగం సంపాదన కావాలని కోరుకునేవారు ప్రతి శుక్రవారం మంగళవారం తెల్లవారుఝామున లేచి స్నానం చేసి విభూతి కుంకుమ ధరించి ఆవుపాలు కాచి పంచదార కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఈమంత్రాన్ని 108 సార్లు జపించి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. చాలా త్వరగా ఉద్యోగం వస్తుంది. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వ్యసనాలతో అల్లాడిపోయేవారి చేత రాత్రిపూట ఈమంత్రాన్ని యథాశక్తిగా జపం చేయిస్తే వ్యసన విముక్తులౌతారు. భార్యాభర్తల సంబంధం సక్రమంగా సాగి, సత్సంతానం కలగడానికి ఈమంత్రాన్ని 41 రోజులపాటు రోజు 100 సార్లు జపించాలి. తప్పక ఫలితం లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0029 నామం : అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation