శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0027 నామం : నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
"ఓం నమఃనిజసల్లాప మాధుర్యవినర్భర్తిత కచ్ఛపయై నమః"
సరస్వతి దేవి చేతిలోని వీణని కచ్ఛపీ అంటారు. కచ్ఛపీ నాదం మహామధురం. ఒకసారి అమ్మవారు కొలువుదీరి ఉండగా సరస్వతీదేవి తన వీణను వాయించి కచేరి చేసింది. ఆమధురనాదానికి అమ్మవారే కాకుండా కొలువులో ఉన్న దేవీదేవతలంతా పరవశించిపోయారు. అప్పుడు అమ్మవారు సరస్వతీదేవిని ప్రశంసిస్తూ కొంతసేపు మాట్లాడింది. ఆ ఒక్క క్షణకాలం సభ మొత్తం పరవశత్వంతో నిశ్చేష్టమైపోయింది. ఎందుకంటే అమ్మవారి మాటలు సరస్వతీదేవి వీణానాదాన్ని మరపిస్తూ వేయిరెట్లు ఎక్కువైనా మాధుర్యంతో ఉన్నాయి. అమ్మవారి సంలాప మాధుర్యం కచ్ఛపీ మాధుర్యాన్ని కూడా తక్కువ చేసిందన్నమాట. అమ్మవారి పలుకులు మహామధురాలు. సుస్పష్టాలు, రమ్యమనోహరాలు. ఇక్కడ సరస్వతీ వీణను కించపరచడం కాదు. అమ్మవాక్కుల మాధుర్యం ఎంతగొప్పదో తెలియజేయడమే ఈమంత్ర నామోద్దేశ్యం. ఏ అక్షరాన్ని ఎక్కడ పలకాలో, ఏ స్వరం ఎలా ఉచ్చరిస్తే మాధుర్యం, మహిమ ఉంటాయో అమ్మవారు ఉచ్చరించి లోకానికి నేర్పింది. అందుకే ఈనామం. వాక్శుద్ధిని ప్రసాదించే నామం అంటారు. పూర్వం వసంతుడనే మూగవాడిని పలికించడానికి వసిష్ఠుడు ఈమంత్రాన్ని జపించాడని దాని ప్రభావంతో మూగవాడు పలికాడని పురాణాలు చెబుతున్నాయి.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం నమఃనిజసల్లాప మాధుర్యవినర్భర్తిత కచ్ఛపయై నమః"
నత్తితో బాధపడేవారు, రేఫను (ర అనే అక్షరాన్ని) సరిగ్గా పలకలేనివారు, భాషాజ్ఞానం లేనివారు, తడుముకుంటూ మాట్లాడేవారు ఈమంత్రాన్ని ఒకసంవత్సరకాలం దీక్షగా భక్తితో రోజుకి 108 సార్లు జపిస్తే వారివారి లోపాలు పోయి అద్భుత వాక్పటిమ, భాషాపటిమ వస్తుంది. జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకునేవారు రాత్రిపూట ఈమంత్రాన్ని జపిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి అవుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0028 నామం : మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation