శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0027 నామం : నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
"ఓం నమఃనిజసల్లాప మాధుర్యవినర్భర్తిత కచ్ఛపయై నమః"
భాష్యం
కచ్చపి అంటే సరస్వతీ దేవియొక్క వీణ. అమరకోశంలో
విశ్వావసోస్సా బృహతీ || తుంబురోస్తు కలావతీ ।
సా నారదస్య మహతీ । సరస్వత్యాస్తు కచ్ళపీ ॥
విశ్వావసుని వీణ పేరు - బృహతి
తుంబురుడి వీణ పేరు - కలావతి
నారదుడి వీణ పేరు - మహతి
సరస్వతి వీణ పేరు - కచ్ళపి
వీణలో అక్షరాలు స్పష్టంగా వినిపించక పోయినప్పటికీ, ప్రేళ్ళు మీటినప్పుడు వచ్చే స్వరము గతంలో మనకు తెలిసిన అక్షరాలను గుర్తుకు తెచ్చి రసానుభవం కలగచేస్తుంది. అయితే సరస్వతీ దేవి వీణలో మిగిలిన వాటికన్న స్పష్టత ఎక్కువగా ఉంటుంది.
పరమేశ్వరుని సేవిస్తున్నటువంటి సరస్వతీ దేవి తన వీణ అయిన కచ్చపిని సృతి చేసి శివుని యొక్క విలాసములను వాయిస్తోంది. అందుకు ఆనందించిన పరమేశ్వరి నోటి వెంట వచ్చిన పలుకులు ఆ వీణానాదం కన్న మనోహరంగా ఉన్నాయి. శంకర భగవత్సాదులవారు సౌందర్య లహరిలోని 66వ శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ
విపంచ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారట్టే వక్తుం చలితశిరసా సాధువచనే ।
తదీయై ర్మాధుర్యై రసలపిత తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుకయతి చోళేన నిభ్రుతమ్ ॥
సరస్వతీ దేవి వీణను సృతి చేసి పరమేశ్వరి ఎదుట శివుని విజయ విలాసాలను మీటుతుండగా, దేవి సంతసించి ప్రశంశావాక్యాలు పలుకుతోంది. వీణానాదంకన్న మధురంగా ఉన్న ఆ పలుకులు విని సిగ్గుపడి సరస్వతీ దేవి తన వీణను గవిసెన గుడ్డతో రహస్యంగా కప్పివేస్తోంది. అంటే పరమేశ్వరి పలుకులు వీణానాదం కన్న మధురంగా ఉన్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below