శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0026 నామం : కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా
"ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతాయై నమః"
లోకాలను ఆశీర్వదించడానికి ముఖశుద్ది ఉండాలి. అందుకోసం అమ్మవారు కర్పూరవీటికను వేసుకుంది. "లేత తమలపాకులు ఈనెలు చీల్చి దానిపైన కొద్దిగా సున్నం రాసి, మంచి ముత్యాలు కాల్చగా వచ్చిన భస్మం వేసి, యాలకలు, పచ్చకర్పూరం, లవంగాలు, కొద్దిగా కస్తూరి, జాజికాయ, వక్కపొడి, కొన్నిరకాల సుగంధద్రవ్యాలు కలిపిన తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు". ఆమోదం అంటే సువాసన. అమ్మవారు వేసుకున్న కర్పూర తాంబూలం నుండి వచ్చే సువాసన దిక్కుల చివరి వరకూ వ్యాపించింది. ఆ వాసనకు ఆకర్షించబడి దిగంతాల నుండి సకల ప్రాణులూ అమ్మవారి వద్దకు తరలి వస్తున్నాయి. మానవులు ఎన్నో జన్మల సంస్కారం తరువాత మానవ జన్మలోకి వచ్చినా పాత వాసనలు వదలక మరలమరలా భ్రష్టులై సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
ఇటీవల ఒకశిష్యుడు నావద్దకు వచ్చి మద్యం అంటే తనకు అసహ్యమని, దానివాసన తనకసలు పడదని, కానీ సాయంత్రం రాగానే మిత్రులు అందించే మద్యం త్రాగేస్తానని, ఇష్టం లేకపోయినా ఎంత నచ్చజెప్పినా తన మనసు తన మాట వినడంలేదని మొఱపెట్టుకున్నాడు. ఈరకమైన వ్యసనాకర్షణనే పూర్వజన్మ వాసన అంటారు. ఎంత ప్రయత్నించినా వ్యసనాలకేసి ఆకర్షింపబడుతున్న మనస్సు మరలకపోవడానికి గల పూర్వజన్మలవాసనలను తొలగించడానికే భగవంతునికి షోడశోపచారాలను ఉపాసనా విధానంలో ఏర్పాటు చేశారు.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతాయై నమః"
భయంకర వ్యసనాలతో పడి కొట్టుమిట్టాడేవారికి ఈమంత్రం గొప్ప ఔషధం. రోజూ ఈమంత్రాన్ని ఉదయం స్నానం చేశాక అమ్మవారి పటం ఎదురుగ పెట్టుకొని 108 సార్లు జపించాలి. పంచదారో, బెల్లమో నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా ఒక సంవత్సరకాలం చేస్తే వ్యసనాల నుండి విముక్తి పొంది ఆరోగ్యవంతులౌతారు. సాధకునికి వ్యసన తీవ్రత ఎక్కువ ఉంటే ఓంకారాన్ని ఆద్యంతాలలో ఉంచి జపించాలి. "ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతాయై నమః ఓం" దీనివల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0027 నామం : నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation