శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0026 నామం : కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా
"ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతాయై నమః"
భాష్యం
కర్పూరము మొదలైన సుగంధద్రవ్యాలతో కలిసిన తాంబూలము వేసి కొనటం వలన
దిగంతముల వరకు సువాసనలు వ్యాపించినది.
అసలు తాంబూలంలో ఏం వేస్తారు? కర్పూర వీటిక అంటే ఏమిటి?
ఏలా లవంగ కర్పూర కస్తూరీ కేసరాదిభిః ॥
జాతీఫలదశైః పూగైః లాంగుల్యూషణ నాగరైః
చూర్హెః ఖాదిరసారైశ్చ యుక్తా “కర్పూర వీటికా” ॥
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేసరము అంటే కుంకుమ పువ్వు, జాజికాయ, వక్కలు, జాపత్రి, చలువ మిరియాలు, కాచు, తమలపాకులతో కూడిన దానిని కర్పూర వీటిక అంటారు. ఈ తాంబూలము యొక్క సువాసనను ఆక్రాణిస్తున్న దిక్పాలకులే వస్త్రముగా గలది.
దేవి ముఖం నుంచి బయటకు వచ్చే తాంబూలకబళము కోరుతున్న దేవతలకు అది లభించలేదు. కనీసం దాని వాసన అయినా గ్రహిద్దాము అని వారు ఆ సువాసనను ఆగఘ్రాణిస్తున్నారు.
కర్పూర వీటికను వేసుకోవటంవల్ల దేవి ముఖ పరిమళము దిగంతములకు వ్యాపించినది. దేవి తాంబూలాన్ని దాని పరిమళాన్ని వర్ణిస్తూ శంకర భగవత్సాదులవారు తమ సౌందర్య లహరిలోని 65వ శ్లోకంలో
రణే జిత్వా దైత్యా నపహృతశిర స్రైఃకవచిభి
నివృత్తై శ్చండాంశ త్రిపురహర నిర్యాల్యవిముఖైః !
విశాఖ న్రోపేన్రై శృశివిశద కర్పూరశకలాః
విలీయన్తే మాత స్తవ వదన తామ్మూల కబళాః ॥
తల్లీ ! రాక్షసులను జయించి యుద్ధ రంగాన్నుంచి తిరిగివస్తూ శివనిర్మాల్యము ఒద్దనుకున్న కుమారస్వామి, విష్ణువు, ఇంద్రులచేత, నీ నోటి నుంచి వచ్చిన తాంబూల కబళములు కాజేయ బడుతున్నవి.
అంటే శివనిర్మాల్యముకన్న్మ శక్తి యొక్క తాంబూల కబళానికే ప్రాముఖ్యత ఉన్నదని చెబుతున్నారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below