శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0025 నామం : శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా
"ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః"
అమ్మవారికి పైన పదహారు, క్రింద పదహారు దంతాలున్నాయి. ఈ మన దంతాలు మానవుల వంటివి కావు. శుద్ద విద్య తల్లికి దంతాలుగా ఉన్నాయి. శుద్ద విద్య అంటే నేను నాది పరుడు, పరునిది అనే భేదభావం లేనిది. భేదబుద్ది వల్ల మానవుడు భగవంతుడికి దూరమౌతున్నాడు. ఈభావం పొతే భగవత్స్వరూపుడు అవుతాడు. జీవుడిని దేవుడిగా మార్చేది శుద్ధవిద్య. శుద్ధవిద్య మొలకలా? అనిపిస్తున్నాయి. అమ్మవారి దంతాలు, ఒక విత్తనం భూమిలో వేశాక అది కుళ్లిపోకుండా, నాని మొక్క అవ్వడానికి సిద్ధంగా ఉండడం మొదటిదశ. ఈడే వాక్కులలో "పరా" నామంతో వ్యవహరింపబడుతుంది. విత్తనం మొలకెత్తడం రెండవ దశ. ఇదే వాక్కులలో "పశ్యంతి" మెలకెత్తాక విత్తనం నుండి రెండే రెండాకులు ముందుగా అటూ ఇటూ ఉంటాయి. చెట్టు పెరిగేదాకా దీని నుండే ఆహారం లభ్యమౌతుంది. ఇదే వాక్కులలో మధ్యమ, ఈ ఆకులూ రెండూ బాగా వికసించి వేరుతోపాటు కలసి ఉంటేనే చెట్టు మొలకలాంటిది. అమ్మవారి దంతాలు ఈ మొలకలలాగా ప్రకాశిస్తున్నాయి. ఇంతకీ పదహారు పైన, పదహారు దంతాలు శుద్ధవిద్య అంటున్నారు. శుద్ధవిద్య అంటే ? అని అగస్త్యుడు హయగ్రీవుడిని అడిగాడు. శ్రీషోడాక్షరి విద్య అని హయగ్రీవుడు సమాధానం చెప్పాడు.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః"
అనగా అమ్మవారి దంతాలు షోడశాక్షరి మంత్ర స్వరూపాలు. ద్విజులు అంటే విప్రులు. ముప్పదిరెండు తంత్రశాస్త్ర దీక్షలు స్వీకరించిన అగస్త్యుడు మున్నగు ముప్పై రెండుమంది బ్రాహ్మణులు అమ్మవారి దంతలుగా ప్రకాశిస్తున్నారు. అందుకే ఈమంత్ర జపం చేస్తే బ్రహ్మవిద్య లభిస్తుంది. ఈమంత్రం రోజూ శక్తిని అనుసరించి జపిస్తే తిరుగులేని పాండిత్యం లభిస్తుంది. వాక్సుద్ధి కలుగుతుంది. దానివల్ల అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. సరిగ్గా చదువు రాక బాధపడుతున్న పిల్లలచే రోజూ ఈమంత్రం 11 సార్లు జపం చేయిస్తే విద్యలలో రాణిస్తారు. సకల విద్యాభివృద్ధిని కలిగించే మహామంత్రమిది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0026 నామం : కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation