శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0025 నామం : శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా
"ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః"
భాష్యం
శుద్ధవిద్య అంటే జ్ఞానవిద్య. అది ఇది అనే భేదం లేనటువంటిది. అదే శ్రీవిద్య. దత్తాత్రేయసంహిత మొదలైనచోట్ల ఆ విషయం చెప్పబడింది. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ సృష్టి చెయ్యాలని సంకల్పించినప్పుడు తనలోని కొంతశక్తిని ముందుగా బయటకు పంపాడు. అదే శక్తి శ్రీచక్రములోని ఎనిమిదవ ఆవరణ అయిన త్రికోణము. బిందువు పరబ్రహ్మ స్వరూపము త్రికోణముశక్తి స్వరూపము.
త్రికోణ రూపిణీశక్తిః బిందురూపపర శ్శివః
ఈ రెండింటికీ భేదం లేదు. రెండూ ఒక్కటే. పరమేశ్వరియే పరబ్రహ్మ స్వరూపము. కాబట్టే శ్రీవిద్య జ్ఞానవిద్య, మోక్షవిద్య అని చెప్పబడింది. శ్రీవిద్యలో పంచదశి మహామంత్రము గాయత్రి వంటిది. కాగా షోడశిమంత్రము జ్ఞానప్రదాయిని. ఇదే బ్రహ్మవిద్య. ఆధారచక్రం నుండి బయలుదేరి ముఖంద్వారా బయటకు వచ్చిన శ్రీవిద్య గురుశిష్య పరంపరగా వ్యాప్తి చెందింది. శబ్దబ్రహ్మ రూపమైనటువంటి వీజంలోని అభివృద్ధి దశ పరావాక్కు అంటే పరాస్థానంలోవాక్కుకు నాంది ఏర్పడుతుంది. అక్కడ నుండి ఆధారచక్రంలో అంకురంగా ఉంటుంది. అది పశ్యస్తీవాక్కు. అక్కడ నుండి అనాహతము దగ్గర వరకు ఉండే వాక్కు మధ్యమ, ముఖము నుండి బయటకు వచ్చేది వైఖరి వాక్కు పరావాక్కు బ్రహ్మరంధ్రం దగ్గర పుడుతుంది. ఇది వాక్కుకు ఊహ. పశ్యస్తీ వాక్కు
ఆధారచక్రంలో గాలిబుడగలాగా పుడుతుంది. ఇది మొలకెత్తుతున్న ధాన్యపుగింజలాగా
ఉంటుంది. అది క్రమేణా అభివృద్ధి చెంది మొలక నుంచి రెండు ఆకులు కలిసి బయటకి వచ్చినట్లుగా ఉంటుంది. పరావాక్కును ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. కేవలము ఇది ఊహ. పశ్యన్తీ వాక్కు కొద్దిగా తెలుస్తుంది. కాని అది ఏమిటి అనేది పూర్తిగా తెలియదు. మధ్యమావాక్కులో మొలకలోని రెండు ఆకులు విడిపోతాయి. కాబట్టి కొంతవరకు తెలుస్తుంది. ఈ మధ్యమవాక్కు కంఠస్థానం చేరి అక్కడ విశుద్ధి చక్రంలోని పదహారు దళాలలోగల అచ్చులతో కలిసి స్వచ్చంగా బయటకు వస్తుంది. అది వైఖరీ వాక్కు ఆధారచక్రం నుంచి అనాహతం వరకు కేవలము హల్లులే ఉంటాయి. అందుచేత
వాక్కులో స్వచ్చత ఉండదు.
కకారాదిక్షకారాంతా వర్జాస్తే శివరూపిణః
క నుంచి క్ష వరకు ఉన్న హల్లులు శివరూపాలు. అలాగే అచ్చులు శక్తిరూపాలు. ఈ రెండూ కలిస్తేనే పూర్తిగా స్వరం బయటకు వస్తుంది.
హల్లులు లేకుండా ఉండే పదహారు అక్షరాలు అచ్చులు. శుద్ధవిద్య. ఈ పదహారు అక్షరాలు అంకురంలోని ఆకులజంట. శివశక్తులు ప్రతివర్ణంలోనూ కలిసే ఉంటారు. అందుచేత అచ్చులు పదహారు శివశక్తుల జంటగా భావిస్తే అవి పదహారు జతలు అంటే ముఫ్ఫైరెండు అవుతున్నాయి. ఆ ముఫ్పై రెండే దంతాల రూపంలో ఉన్నాయి.
షోడశిమంత్రం పదహారు అక్షరాలు గలది. ఈ పదహారు అక్షరాలలోను శివశక్తులున్నారు కాబట్టి అవి పదహారు జతలు అంటే ముఫ్పై రెండు సంఖ్య. అదే నోటిలోని దంతాల సంఖ్య.
ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. వేదవిద్య బ్రాహ్మణుని ఆశ్రయించి ఉన్నది.
వేదాదయో విద్యా హి బ్రాహ్మణ మే వాశ్రిత్య తిష్టంతి ।
విద్యాహవై బ్రాహ్మణమాజగా మేతి.
అని శ్రుతి.
విద్య అనేది బ్రాహ్మణులచే ఉపదేశింపబడి విస్తరిస్తోంది కాబట్టి బ్రాహ్మణులే విద్యాంకుర రూపులు. అందుచేత వేదవిద్యాంకురాకారమైన బ్రాహ్మణులపంక్తిచే ప్రకాశించేది. బ్రాహ్మణులు అంటే పరబ్రహ్మముఖంనుంచి పుట్టినవారు. బ్రహ్మయొక్క అన్వేషణలో కాలం గడిపేవారు. సదా సత్యాన్వేషణ చేసేవారు. వేదంలో బ్రాహ్మణోస్యముఖ మాసీత్ అని చెప్పబడింది. కాబట్టి విద్యాంకురాలయిన బ్రాహ్మణులే పరమేశ్వరి యొక్క దంత పంక్తి.మంత్ర శాస్త్రం వీటిని శుద్ధవిద్యలు అంటారు.
ఈ ముఫ్ఫై రెండు దీక్షలే దంతములు.
ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు బ్రాహ్మణుడు. ఉపనయనము వరకు ఒక జన్మ.ఉపనయన సంస్కారము తరువాతది మరియొక జన్మ. ద్విజ అంటే రెండు జన్మలు కలది. ముందు గ్రుడ్దుగా పుట్టి తరువాత రూపము పొందునది. పక్షి చేప, పాము మొదలైనవి. ఈ నామంలో ద్విజపంక్తి అంటే వేదవిజ్ఞానాన్ని ప్రవర్తిల్ల చేస్తున్న బ్రాహ్మణుల వరుస అని అర్ధం చెప్పటం జరిగింది. మంత్రశాస్త్రంలో శుద్ధవిద్య అనే ప్రత్యేకమైన విద్య ఉన్నది. దీనికి సదాశివుడు బుషి. గాయత్రి ఛందస్సు. ఈ విద్యయే అంకురముగా గలది. శుద్ధవిద్య దగ్గర నుంచి అనుత్తర దీక్ష వరకు గల ముఫ్ఫై రెండు దీక్షలను తీసుకున్న శ్రేష్ణులవేత పొందదగినది. కాబట్టే శుద్ధవిద్యాంకురాకారా అని చెప్పబడింది. బ్రహ్మవిద్య, వేదవిద్య, ఉపనిషద్విద్య, తెలిసిన బ్రహ్మజ్ఞానులకు పరాశక్తి దర్శనం సుసాధ్యం. అంతే కాని అన్యులకు మాత్రం కాదు.
అస్యశ్రీ శుద్ధవిద్యామహామంత్రస్య సదాశివబుషిః | గాయత్రీ ఛందః । శ్రీశుద్ధ
విద్యామనోన్మన్యంబా దేవతా । ఐం బీజం ॥ ఈం శక్తిః । జెః కీలకం । జపే వినియోగః 1
న్యాసము : మంత్రముతో రెండు ఆ వృత్తులు న్యాసము చెప్పాలి.
ధ్యానము : శుద్ధస్ఫటికసంకాశాం శుద్ధవిద్యాం మనోన్ననీం ॥
పుస్తకం చాక్షమాలాం చ జ్ఞానముద్రా మభీతికం ॥
ధారయంతీం శివాం దేవీం పశుపాశ విమోచనీం
సర్వమంత్రప్రకాశాం చ మాతృకారూపిణీం భజే ॥
లో బాలా, మాతంగీ మొదలయిన ముఫ్పై రెండు రకాల దీక్షలున్నాయి. వీటివల్ల జ్ఞానము విస్తరించటంచేతనే వీటిని విద్యాంకురాలు
మంత్రము : ఐం ఈం ఔః ॥
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below