శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0024 నామం : నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా
"ఓం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిదనచ్ఛదాయై నమః"
లలితాసహస్రనామ స్తోత్రంలోని 24వ మహామంత్రం ఇది. ఈనామ మంత్రంలో శ్రీ గాయత్రీ దేవ్యానుష్ఠానంలోని 24ముద్రలు ఇమిడి ఉన్నాయి. అంతర్లీనంగా విద్రుమమంటే పగడం. నవవిద్రుమమంటే అప్పుడే పండిన పగడం. దీనిలో చాలా శోభా ఉంటుంది. చూచినవారిని ఆకర్షించే లక్షణం ఉంటుంది. బింబం అంటే దొండపండు. నవబింబం అంటే అప్పుడే పండిన దొండపండు. ఇది చాలా ఎఱ్ఱగా అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు పగడాలను కూడా తిరస్కరించే ఎఱ్ఱని రంగులో ఉన్నాయి. దొండపండు ఎర్రదనాన్ని కూడా కించపరిచేలా ఎఱ్ఱగా ఉంది. పెదవులు దొండపండుతో, పగడంతో పోల్చడంలో యోగ జ్యోతిష్యపరమైన అర్థాలున్నాయి. చిలుకలు దొండపళ్ళు తింటే మాట్లాడతాయని ప్రతీతి. వేదం అనేది చిలుక అయితే అక్షరాలు దొండపళ్ళు. ఆరెండూ అమ్మవారి పైపెదవి క్రింది పెదవి. వీటిని తదేక దృష్టితో చూస్తూ ధ్యానిస్తే వేదమంత్ర జ్ఞానం లభిస్తుంది. అప్పుడు సాధకుడు శుకునిలాగా అవధూత అవుతాడు. పగడం కుజునికి ప్రీతికరమైనది. కుజదోష నివారణకు ఇది చాలా ముఖ్యమైనది. పైగా చిలుక ముక్కులాగా, దొండపండులాగా ఉంటుంది.
మంత్రప్రయోగం ఫలితం
కుజదోష నివారణ కొఱకు "ఓం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిదనచ్ఛదాయై నమః" అనే మంత్రాన్ని ఒకసంవత్సరకాలం రోజునకు 27సార్లు జపించాలి. పెళ్లి జరగడం ఆలస్యమైనప్పుడు 41 రోజులు ఈమంత్రాన్ని రోజూ 108 సార్లు ఉదయం జపిస్తే తొందరగా వివాహం అవుతుంది. కొందరికి అక్షరాలు సరిగ్గా పలకవు. అటువంటివారు రోజూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. స్పష్టంగా పలికే శక్తి వస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0025 నామం : శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation