శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0024 నామం : నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా
"ఓం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిదనచ్ఛదాయై నమః"
భాష్యం
దొండపండులాంటి పెదవులు కలది ఆ దేవి. పరమేశ్వరి పెదవులు ఎర్రగా దొండ పండ్లవలె, పగడమువలె ప్రకాశిస్తున్నాయి. అప్పుడే సానపట్టిన పెదవులకన్న ఎరుపుదనము కల పెదవులు కలిగినది. పై పెదవిని విద్రుమమని, క్రింది పెదవిని బింబమని అంటారు. దుర్వాసుడు దేవి పెదవులను శ్లాఘిస్తూ
తాంబూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం
తాంబూలసేవనముచేత ఎర్రబారిన పెదవులు కలది. సౌందర్య లహరిలోని 62వ శ్లోకంలో శంకరభగవత్సాదులు దేవి అధరాలను వర్ణిస్తూ
ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి ! దంతచ్ళదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా ॥
న బింబం తద్బింబప్రతిఫలనరాగా దరుణిమం
తులా మధ్యారోధుం కథమివ న లజ్జేత కలయా? ॥
చక్కని పలువరుస గల ఓ దేవీ! సహజంగా కెంపులు దేలుతున్న నీ పెదవుల సాబగునకు సరియైన పోలికను చెబుతాను. పగడపు తీగె పండు పండినప్పుడు, ఆ పండు నీ పెదవుల కాంతికి సాటి అగుచున్నది. అంతేకాని కేవలము పగడపు తీగె మాత్రం సాటికాదు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below