శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0023 నామం : పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః
"ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభువే నమః"
అమ్మవారు ఎఱ్ఱగా కెంపు వర్ణంలో శోభిస్తుంది కనుక ఆతల్లి చెక్కిళ్ళు కూడా ఎర్రగా మెరిసిపోతున్నాయి. అవి పద్మరాగమణులతో తయారయిన అద్దాలను కూడా మించి ప్రకాశిస్తున్నాయని పైనామం చెబుతున్నది. మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. పద్మరాగాలను అద్దాలను కూడా తిరస్కరించే చెక్కిళ్ళు గలది అమ్మవారు. అద్దాలలో ఎదుటివారి ముఖాలు కనిపిస్తున్నాయి. అమ్మవారికి ఎదురుగా ఉన్నవారు తామనితాము ముఖంలో చూసుకోవచ్చు. అనగా అమ్మవారి భక్తులు అమ్మలో ప్రతిఫలిస్తారు. చివరకు అమ్మవారైపోతారు. అంతరార్థం పరిశీలిద్దాం. అమ్మవారు తన భక్తులను తన అంతటివారిని చేస్తుంది. మనం చేయవలసింది ఆమె దగ్గరకు వెళ్లడం. ఆమె దగ్గరకు వెళ్లాలంటే ఆమె పుత్రులుగా అందరినీ భావించి ప్రేమిస్తే చాలు సృష్టికి సృష్టి కర్తకి బేధం లేదని గ్రహించడమే ఈ నామాంతరార్ధం.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభువే నమః"
ఎవరిని చూచినా అసహ్యం కలగడం, ఎవరి అభివృద్ధిని చూచినా ఓర్వలేకపోవడం, ఈర్ష్యాసూయాది లక్షణాలతో కృంగిపోతూ, చివరకు అనారోగ్యాల పాలయ్యేవారు ఈమంత్రాన్ని రోజూ 11 సార్లు జపిస్తే పై మానసిక రోగాలు తొలగుతాయి. చిన్నచిన్న తప్పులకు కూడా కోపం తెచ్చికొని విద్యార్థులను శిక్షించే ఉపాధ్యాయులు ఈమంత్రాన్ని 41 రోజులు జపిస్తే, ఆ అవలక్షాణాన్ని విడిచి విద్యార్థులకు ప్రేమతో బోధించే మంచి అధ్యాపకులుగా పేరుతెచ్చుకోగలుగుతారు. నాయకులు చెడ్డపేరు వచ్చిందని బాధపడేటప్పుడు ఈమంత్రాన్ని 41 రోజులు రోజూ 108 సార్లు జపిస్తే అపకీర్తి తొలగుతుంది. పిల్లలతో అస్తమానూ తగాదాపడే తల్లిదండ్రులు ఈమంత్రాన్ని నిత్యం 18 సార్లు జపిస్తే తగాదాలు రావు. ప్రశాంత కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0024 నామం : నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation