శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0022 నామం : తాటంక యుగళీభూత తపనోడుప మండలా
"ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః"
సూర్యుడు చంద్రుడు అమ్మవారికి చెవి దిద్దులుగా ఉన్నాయని పై మంత్రార్థం. ఈ సృష్టిలో అనేక కోట్ల సూర్యులు, చంద్రులు ఉన్నారు. అందుకే వేదంలో "సూర్య చంద్రౌస్తనౌ దేవ్యాః తావేవనయనేస్మృతౌ ఉభౌతాటంకయుగళ మిత్యేషా వైదికి శ్రుతిః" అని చెప్పబడింది. సూర్యచంద్రులు అమ్మవారికి స్తనాలు. అవే అమ్మవారి నేత్రాలు, అవే అమ్మవారి కర్ణాభరణాలు అన్నమాట. ఈ రెండూ ఎట్టి పరిస్థితులలోనూ చెవిదిద్దులుగా ఎవరికీ ఉండవు. అందుకే "యుగళీభూత" అన్నారు. సాక్షాత్తూగా సూర్యచంద్రులు చెవికమ్మలుగా ఉంచుకోగలిగిన శక్తి అమ్మవారికి తప్ప ఈచరాచర జగత్తులో మరెవ్వరికీ ఉండదు. సూర్యుడు జ్ఞాప్రదాత. ఆరోగ్యదాత. చంద్రుడు మనఃకారకుడు ఆనందదాత. ఈ ఇద్దరు కర్ణాభరణాలుగా ఉన్న అమ్మవారి మంత్రాన్ని జపిస్తే జ్ఞానం, ఆరోగ్యం,ఆనందం, మనశ్శాంతి అనే నాలుగు రకాల శుభాలు కలుగుతాయి. తొమ్మిది జన్మలలో సూర్యుడిని ఆరాధిస్తే ఈజన్మలో అసాధారణ జ్ఞానం లభిస్తుందని, దానివల్ల కీర్తి వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః"
ఓం తాటంకయుగళీభూత తపనోడుప మండలాయై నమః అనే ఈమంత్రాన్ని 90 రోజులు జపిస్తే ఫలితం వస్తుంది. భక్తితో నిరంతరం ఆదిత్య హృదయం జపిస్తే ఆరోగ్యం లభిస్తుంది. కానీ ఈమంత్రాన్ని ఒక్క సంవత్సరకాలం సూర్యోదయ సమయంలో రోజూ 18 సార్లు జపిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. చంద్రుని వెన్నెలలో 9జన్మలపాటు పురుషసూక్తాన్ని పఠిస్తూ శ్రీమహావిష్ణువుకు నైవేద్యం నివేదించి, బంధుమిత్రులతో కలిసి సేవిస్తే ఆనందం మనశ్శాంతి లభిస్తాయి. కేవలం 90 రోజులు ఈమంత్రాన్ని భక్తితో రాత్రిపూట 108 సార్లు జపించినవారికి ఈఫలితం లభిస్తుంది. నిత్యం వీలున్నప్పుడల్లా జపించేవారికి సుఖశాంతులు లభిస్తాయి...
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0023 నామం : పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation