శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0022 నామం : తాటంక యుగళీభూత తపనోడుప మండలా
"ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః"
భాష్యం
సూర్యచంద్రులు దేవి కమ్మల జంటగా ఉన్నారు
సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా స్తావేవ నయనే స్మృతే
ఉభౌ తాటంక యుగళ మిత్యేషా వైదికీశ్రుతిః
సూర్యచంద్రులే దేవియొక్క స్తనాలుగా, కనులుగా, చెవి కమ్మలుగా ఉన్నారు అంటోంది శృతి.
తాటంకథారణం స్త్రీణాం భర్తు రాయుష్యవర్ధనమ్
సౌభాగ్యవతులు తాటంకములు ధరించుట వారి భర్తలకు ఆయుః కారకము.
దేవీ భాగవతంలో మణిద్వీపంలోని దేవిని వర్ణిస్తూ
కనచ్ళీచక్ర తాటంక విటంక వదనాంబుజా
శ్రీచక్రాకారము గల బంగారు ఆభరణములతో పరమేశ్వరి ముఖము ప్రకాశిస్తున్నది. దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని 36వ శ్లోకంలో దేవి కర్ణాభరణాలను ధ్యానిస్తూ
తప్త స్వర్ణ కృతోరుకుండల యుగం మాణిక్యముకోలస
ధ్ధీరాబద్ధ మనన్యతుల్య మపరం హైమం చ చక్రద్వయం ॥
శుక్రాకారనికారదక్ష మమలం ముక్తాఫలం సుందరం
బిథ్ర త్మర్హయుగం భజామి లలితం నాసాగ్రభాగం శివే ॥
దేవీ నీ చెవుల జంటను, నాసాగ్ర భాగాన్ని నా మనస్సున సాక్షాత్కరింప చేసుకుని ఉపాసిస్తాను. పెద్ద పెద్ద బంగారు కుండలములను, మాణిక్యములు, ముత్యములు, వజ్రములు తాపడము చేసినటువంటి బంగారు ఆభరణములు ధరించి నీ కర్ణయుగళము శుక్రగ్రహము కన్న తెల్లగా ప్రకాిశించేటటువంటి ముత్యాలు పొదిగిన ముక్కెరలు ధరించిన నీనాసాగ్ర భాగమును నేను ధ్యానిస్తున్నాను.
శంకరులవారు తమ సౌందర్య లహరిలోని 58వ శ్లోకంలో దేవియొక్క కమ్మలు
మన్మథుని విల్లు అంటున్నారు.
ఆరాళం తే పాలీయుగళ మగరాజన్య తనయే !
న కేషా మాధత్తే కుసుమశరకోదండకుతుకమ్
తిరశ్చీనో యత్ర శ్రవణ పథముల్లజ్ఞ్య విలసన్
అపాజ్లవ్యాసజ్లో దిశతి శరసన్ధానధిషణామ్ ॥
ఓ దేవీ ! శైలరాజతనయా ! నీ చెవి కమ్మలజంట మన్మథుని కోదండసౌభాగ్యాన్ని తలపింప చేస్తున్నది. ఎందుకంటే నీ కనుకొనల యొక్క కటాక్ష వీక్షణ ప్రకాశము అడ్డముగా తిరిగి చెవులను దాటి మెరయుచున్నదై బాణాలు సంధించబడుతున్నాయనే ఊహను కలిగిస్తున్నది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below