శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0021 నామం : కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా
"ఓం కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరాయై నమః"
కదంబం అంటే కడిమి చెట్టు. ఈ చెట్టు అమ్మవారికి, శ్రీకృష్ణుడికి కూడ చాలా ఇష్టం. లలితా సహస్రనామ పారాయణ బాగా జరిగే ప్రదేశాలలోనే ఈ చెట్లు పెరుగుతాయి. ఈచెట్టు పూలు తన చెవి పై భాగంలో ధరిస్తుంది అమ్మవారు. అలా ధరించడంలో అమ్మవారు అపూర్వసౌందర్యంతో మనోహరాలై కనబడుతుంది. మనిషికి శరీరంపై భ్రాంతి వ్యామోహం ఉన్నంతవరకూ దుఃఖం తప్పదు. సౌందర్య మోహమో, దురహంకారమో లేని జీవి ఉండదనీ, దానివల్ల పదేపదే జన్మనెత్తి దుఃఖాలు అనుభవిస్తాడని అందరిలో ఉంది ఒకే పరమాత్మ అనే భావన పొందితే ఈజననమరణ చక్రం నుండి భయటపడతాడని శ్రీకృష్ణుడు కదంబ వృక్షం పైనుండి గోపికలకు తత్త్వోపదేశం చేశాడు. ఈ చెట్టునే అయన ఎందుకు ఎంచుకున్నాడో మనం తెలుసుకోవాలి.
కదంబవృక్షం యోగశక్తి కలిగిన వృక్షం. యోగికి పొగడ్తలు విషం,తెగడ్తలు అమృతం. నిందాస్తుతులు రెండింటిని చెవులతో వింటాం. చెవులు రెండింటిని సమానంగా స్వీకరించి ఆత్మకి అందిస్తే పర్వాలేదు. కాని అలా జరగదు. ఎవరైనా పొగిడితే ఆనందిస్తారు. తిడితే దుఃఖిస్తారు. కడిమి చెట్టు ఈ రెండింటికీ అతీతమైన ఆత్మజ్ఞానాన్ని తనను ఆశ్రయించినవారికి ఇస్తుందని అందుకే శ్రీకృష్ణుడు, శ్రీలలితామాత ఈచెట్టుని ప్రేమిస్తారని శివుడు పార్వతికి తెలియజేశాడు. అమ్మవారు ఈపూలను తనచెవిపై ఉంచుకొని శోభిస్తుందంటే అంతరార్ధం నిందాస్తుతులకు తాను అతీతురాలినని చెప్పడమే. గురూపదేశమంత్రం, కడిమి పూలను ధరించి జపిస్తే జీవి త్వరగా యోగి అవుతాడు. తద్ద్వార దుఃఖ విముక్తి పొందుతాడు. ఎప్పుడు ఏవో ఆపదలతో జీవితం దుఃఖభరితమై అల్లాడేవారికి ఈమంత్రం పరమౌషదం.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరాయై నమః"
నిత్యం ఈమంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఏ దుఃఖం రాదు. అధికారుల వల్ల బాగా దుఃఖపడేవారు అమ్మవారి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని దీపారాధన చేసి, 41 రోజులు రోజూ 108 సార్లు ఈమంత్రాన్ని జపిస్తే దుఃఖం మటుమాయమౌతుంది. జీవితం ఆనందమయమౌతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0022 నామం : తాటంక యుగళీభూత తపనోడుప మండలా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation