శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఇరవైయోవ నామం : తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా
"ఓం తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురాయై నమః"
అమ్మవారు తన ముక్కుకు ఆభరణాలు ధరించింది. ఆ ఆభరణాలు నక్షత్రకాంతులను కూడా తిరస్కరిస్తున్నాయి. దశవిధ మహావిద్యలలో తారాదేవి కూడా ఒక విద్యాస్వరూపిణి. ఈ తల్లి అనుగ్రహం ఉంటె జరిగేది జరగబోయేది తెలుస్తుంది. విద్యాసంపద పెరుగుతుంది. ఈ తారాదేవి కాంతి ముత్యాల ముక్కెర కాంతిని పోలి ఉంటుంది. ఆ తల్లి కాంతిని కూడా మించి అమ్మవారి ముక్కుకున్న ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. కుజగ్రహం, శుక్రగ్రహం కూడా తారానామంతో పిలువబడతాయి. ఇందులో కుజుడు అరుణవర్ణంతోనూ, శుక్రుడు శ్వేతవర్ణంతోనూ ఉంటారు. ఎఱ్ఱని కెంపులు, తెల్లని ముత్యాలు పొదగబడిన అమ్మవారి నాసాభరణాలు, ఈ రెండు గ్రహాలను మించి ప్రకాశిస్తున్నాయి. దీనిలో అంతరార్ధం ఏమిటో తెలుసుకుందాం. లౌకిక విద్యలన్నింటిని మించిన మహావిద్య శ్రీవిద్య. శ్రీ విద్యాదేవి శ్రీలలితాదేవి ఆమె ముక్కు ఆభరణం తారాకాంతిని మించినది. అనగా ఈనామ జపం వల్ల తరావిద్య లభిస్తుంది. నక్షత్రదోషం కుజ దోషం, శుక్రదోషం పరిహారమౌతాయి.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురాయై నమః"
అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి అనబడే 18 నక్షత్రాలలో పుట్టినవారికి శాంతి జరపాలి. లేదంటే వీరికి జీవితమంతా ఒడిదుడుకులే. ఈ నక్షత్రాలలో పుట్టినవారు "ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః" అనే మంత్రాన్ని ఒక సంవత్సరకాలం రోజూ 27సార్లు చొప్పున జపిస్తే నక్షత్ర దోషం నశించి శుభఫలితం పొందుతారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యలలో అభివృద్ధికి ఈమంత్రాన్ని నిత్యం 11 సార్లు చేయాలి. కుజదోషం వల్ల వివాహం కానివారు ఒకసంవత్సరకాలం ఈమంత్రాన్ని ఉదయం వేళ రోజూ 36సార్లు జపించాలి. ఏడాది తిరగకుండానే పెళ్లి కుదురుతుంది. శుక్రదోషం ఉన్న వారు 41 రోజులు ఈమంత్రాన్ని రోజూ 108 సార్లు జపిస్తే దోషం నశిస్తుంది. జాతక దోష పరిహారానికి ఇంతకంటే మంచి మంత్రం మరొకటి లేదు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0021 నామం : కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation