శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఇరవైయోవ నామం : తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా
"ఓం తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురాయై నమః"
భాష్యం
"ఓం నమః"
తారా అంటే కుజ, శుక్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. వాటికన్న కూడా ప్రకాశవంతమైన రత్నములు ముత్యములతో కూర్చబడిన నాసాభరణము (బులాకీ) ధరించినది. లేదా ముక్కెర ధరించినది. ముక్కు చివర పై వైపున ధరించేది ముక్కెర, రెండు ముక్కులను విడదీస్తూ మధ్యలో ఉండే ముక్కు దూలానికి ధరించేది బులాకి. ఈ రెండూ కూడా నాసాభరణాలే.
కుజ నక్షత్రం ఎరుపు రంగులోను, శుక్ర నక్షత్రం తెలుపురంగులోను ఉంటాయి అని రత్నశాస్త్రం చెబుతోంది. అందుచేత ఎరుపు తెలుపు రంగులు గల పగడపు ముక్కెర కుడిముక్కుకు, తెలుపు రంగుగల వజ్రపు ముక్కెర ఎడమ ముక్కుకు ధరించినది. సౌభాగ్యా భరణములలో మంచిముత్యాలు కూడా చెప్పబడ్డాయి. అందుచేత కొంతమంది ముత్యాలముక్కెర అని చెబుతున్నారు.
శంకరభగవత్సాదులు అది ముత్యాలతో చేయబడిన మక్కెర అంటున్నారు సౌందర్య లహరిలోని 61వ శ్లోకంలో
అసౌ నాసావంశ స్తుహినగిరి వంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫల మస్మాక ముచితమ్
వహ త్యన్త ర్ముక్తా శృిశిరకరనిశ్వాసగళితం
సమృద్ధ్యా యత్తాసాం బహి రపి న ముక్తామణిధరః ॥
ఓ తల్లీ ! నీ నాసావంశమునందు ముత్యాలున్నాయనటానికి సందేహం లేదు. ఎందుకంటే ముక్కులోపల ముత్యాలు లేకపోయినట్లెతే శ్వాసవదిలేటప్పుడు ముత్యమెందుకు వెలివడుతుంది? ఆ నాసాదండము నా కోరికలను తీర్చుగాక.
శంకరులవారు నాసాదండము అంటే ఇక్కడ రెండు ముక్కులమధ్యన ఉండే ముక్కు దూలము అని, నాసాభరణము అంటే బులాకీ అని చెప్పారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below