శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ నామం : వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా
"ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మినాభలోచనాయై నమః"
ఉత్తమ స్త్రీల కళ్ళు చేపలవలె ఉంటాయి. అందుకే అటువంటి స్త్రీని మీనాక్షి అంటారు. చేపలు నదీ ప్రవాహంలో కదులుతుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అమ్మవారి ముఖకాంతి ప్రవాహంలా ఉంటుందట. ఆప్రవాహంలో అమ్మవారి కళ్ళు కదులుతున్న చేపలవలె ఉన్నాయట. ఇదీ పైనామానికి అర్థం. చేపలు మనలాగా కంటి మీద రెప్పవేసి నిద్రపోవు. ఎందుకంటే వాటికి అసలు కనురెప్పలే ఉండవు. రెప్పవేయక నిద్రపోయే ఏకైక జీవి చేప. అమ్మ చేపలవంటి కళ్ళతో ఎందుకు దర్శనం ఇస్తోంది.?భక్తులను కంటిమీద రెప్పవాల్చకుండా నిరంతరం కనిపెట్టి రక్షించడానికి. అమ్మవారి అనుగ్రహం పొందినవాడికి మాట వరుసకు కూడా ప్రమాదం రాదు. సాధారణంగా ప్రాణులు తమ పిల్లలను పాలిచ్చి పెద్ద చేస్తారు. కానీ చేప తన పిల్లలకు పాలిచ్చి పెంచదు. కేవలం చూపుతోనే వాటిని అభివృద్ధి చేస్తుంది. చేప చూపుకే దాని పిల్లలు పెరిగి పెద్దవై వృద్ధి పొందుతాయి. అమ్మవారు తన చూపులతో తన సంతామైన మనందరినీ పోషించి వృద్ధి చేస్తున్నది. ఆ తల్లి కటాక్షం పొందడానికి మనకీ మంత్రం పాశుపతాస్త్రం లాంటిది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మినాభలోచనాయై నమః"
అనారోగ్యంతో చిన్నపిల్లలు సరిగా పనిచేయలేకపోతున్నా, శరీరాభివృద్ధి సరిగా లేకపోయినా, పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటూ చురుకుగా ఏపనీ చేయలేకపోతున్నా, కొంచెంసేపు చదవగానే అలసిపోతున్నారా "ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మినాభలోచనాయై నమః" అనే ఈమంత్రం రోజూ 36 సార్లు వారిచేత ఉచ్చరింపజేస్తే తక్షణం ఫలితం లభిస్తుంది. పిల్లలు ఆరోగ్య విద్యాభివృద్ధి పొందుతారు. వార్ధక్యంలో రోజూ అనారోగ్యాలతో బాధపడేవారు వీలున్నప్పుడల్లా ఈమంత్రాన్ని జపిస్తే ఈ అనారోగ్యాలు ఎక్కువగా బాధించవు. సుఖంగా నిద్రించగలరు, చురుకుదనం ఎక్కువగా ఉండాలని కోరుకునేవారు రోజూ 108 సార్లు ఈమంత్రం 41 రోజులు జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పంతొమ్మిదవ నామం : నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation