శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పంతొమ్మిదవ నామం : నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా
"ఓం నవపంచకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః"
నాసా అంటే ముక్కు. నాసాదండం అనగా ముక్కుదూలం. అప్పుడే వికసించిన సంపంగి పువ్వులాగా అమ్మవారి ముక్కు ప్రకాశిస్తుంది. సంపంగి మహా సువాసనతో జీవులందరినీ ఆకర్షిస్తుంది. ఈ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అమ్మ ప్రసన్నురాలై భూమిని ప్రసాదిస్తుందని మంత్రం శాస్త్రాలంటున్నాయి. సొంత ఇంటికోసం స్థలం వెదుకుకునే పనిలో వారు, పొలాలు కొనాలనుకునేవారు సంపంగి పూవులతో 9రోజులు అమ్మవారిని పూజిస్తే చాలు. వారికి అవి లభిస్తాయి. చంపకపుష్పముతో అమ్మ ముక్కును పోల్చడంతో వాగ్దేవతలు కవితా చమత్కారంతో బాటు మంత్రశాస్త్రాన్ని కూడా నిక్షిప్తంగా చేశారు. భూమిగుణం గంధం, ముక్కు గంధాన్ని అనగా వాసనను పసిగట్టగలదు. ముక్కులు సరిగా పనిచేస్తే సగానికి సగం రోగాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం వలన ఈనాడు ప్రజానీకం చాలాభాగం శ్వాస రోగాలతో బాధపడుతుంది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం నవపంచకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః"
ఉబ్బసంతో బాధపడేవారు రోజు పడుకునే ముందు మరలా ఉదయం స్నానానంతరం మంత్రాన్ని 27 సార్లు చొప్పున జపిస్తే ఉబ్బసం నుండి విముక్తి పొందుతారు. ఊపిరి తీసుకోవడానికి కష్టమైనప్పుడు, ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈమంత్రాన్ని 11 సార్లు ముక్కుమీద వేలు వేసుకొని జపిస్తే ఆ బాధలు తొలగిపోతాయి. దగ్గూ, గొంతునొప్పి తగ్గడానికి ఈమంత్రాన్ని వీలునన్ని సార్లు జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read ఇరవైయోవ నామం : తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation