శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ నామం : వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
"ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః"
అమ్మవారి ముఖంలో కనుబొమ్మల జంట మన్మథుని శుభప్రదమైన గృహతోరణం లాగా ఉన్నది. మన్మథుని ఇల్లు మంగళప్రదమైనది. సకల శుభాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంటికి తోరణం ఉండాలి. తోరణాలు కట్టిన ఇంటిలో సకల సంపదలూ ఉంటాయి. అమ్మవారి కనుబొమ్మలు మన్మథుని గృహోపకరణాల వలె ప్రకాశిస్తున్నాయి. మన్మథుని భస్మం నుండి భండాసురుడు పుట్టాడు. వాడిని చంపడానికి అమ్మవారు లలితగా రూపం ధరించి ప్రత్యక్షమైంది. ఈ రూపంలో ఉన్న అమ్మ ముఖం మన్మథ మాంగళ్య గృహం అయితే దానికి తోరణం అమ్మవారు కనుబొమలు. అనగా అమ్మ కనుబొమలు లక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానించేవన్నమాట. ఈ మంత్రంలో సంపద, మాంగల్యం అనే రెండింటి కలయిక ఇమిడి ఉంది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః"
ఈమంత్రాన్ని శుక్రవారం శుక్రవారం స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి దానిపై శ్రీలలితాదేవి రూపాన్ని రాగి, వెండి, బంగారం లేదా మట్టితో తయారు చేసిన దానిని ఉంచాలి. ఎఱ్ఱని పూవులతో ఆరూపును 108 సార్లు ఈమంత్రాన్ని జపిస్తూ పూజించాలి. గులాబీలు, మందారపూలు మున్నగునవి ఎఱ్ఱని పూలైనా పర్వాలేదు. ఇలా ప్రతి శుక్రవారం పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలదు. సకల సంపదలు లభిస్తాయి. స్త్రీలకు వైధవ్యం కలుగదు. ముత్తైదువుగా తనువు చాలిస్తుంది. మంగళవారం పై రీతిలో జపించి పూజిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పద్దెనిమిదవ నామం : వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation