శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ నామం : వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
"ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః"
భాష్యం
చిల్లికా అంటే కనుబొమ. పరమేశ్వరి ముఖము మన్మథుని మంగళగృహము యొక్క
బహిర్హ్వారతోరణము. పరమేశ్వరి వదనము అనే మన్మధుని గృహానికి కనుబొమలు తోరణాలు.
ముఖమనే మన్మథగృహనికి కట్టబడిన మంగళతోరణములవలె నున్న కనుబొమలు గలది. దేవి ఆవిర్భవించినప్పుడు ప్రాతఃస్సంధ్య, సాయం సంధ్యల వల్ల ఆమె కనుబొమలు ఏర్పడినాయి.
ఇక్కడ పంచప్రణవాలు చెప్పబడ్డాయి. అవి
ఐం గా వదనము
క్షీం గా స్మర
సౌః గా మాంగల్య
శ్రీం - గృహము
హ్రీం = తోరణము
షోడశి మహామంత్రంలో పంచప్రణవాలు అనులోమ విలోమంగా చెప్పబడ్డాయి.
పరమేశ్వరి ముఖము ఎంత అందమైనదో వర్ణిస్తూ దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని
48వ శ్లోకంలో
ఉద్యత్త్పూర్ణకలానిధిశ్రివదనమ్ భక్తప్రసన్నం సదా
సంపుల్లాంబుజపత్రకాంతి సుషమాధిక్కారదక్షేక్షణమ్ ॥
సానందం కృతమందహాస మసకృ త్ర్రాదుర్భవ త్కౌతుకమ్
కుందాకారసుదంతపంక్తిశశిభా పూర్ణం స్మరా మ్యంబికే 1॥
అప్పుడే ఉదయించిన సూర్యునివలె భక్తులకు ప్రసన్నమై, తామరపూవుల కన్న మిన్న అయిన నేత్రములతో, చక్కని పలువరుసతో మనోహరముగా నీ ముఖము ప్రకాశిస్తున్నది.
సౌందర్య లహరిలోని 47వ శ్లోకంలో శంకరభగత్పాదులవారు దేవి కనుబొమలను
వర్ణిస్తూ
బృవౌ భుగ్నే కించి ద్భువనభయభంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిరాభ్యాం ధృతగుణమ్
ధను ర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముప్టొచ స్థగయతి నిగూఢాంతర ముమే ! ॥
తల్లీ ! లోకాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ మాతా ! కొంచెము వంగిన నీ కనుబొమలు తుమ్మెదల వంటి కాంతిగల కనులచేత కట్టబడిన అల్లె త్రాడుగల మన్మథుని యొక్క ధనుస్సుగా తలుస్తాను.
పైన చెప్పిన నామంలో మన్మథుని గృహానికి కట్టిన తోరణాలలాగా దేవి కనుబొమలున్నాయి అంటే, సౌందర్య లహరిలో వాటిని మన్మథుని ధనుస్సుతో పోల్చారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below