శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదహరవ నామం : ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా
"ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః"
అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంది. చందమామలో మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి ముఖచంద్రబింబంలో కూడా తన నుదిటి కస్తూరిని బొట్టుగా పెట్టుకుంది. ఆ బొట్టు అమ్మవారి ముఖం అనబడే చంద్రబింబంలో మచ్చలా శోభిస్తుంది. దీనిని రూపాలంకారం అంటారు. అమ్మవారి ముఖానికి చంద్రునికి అబేధం. కస్తూరి తిలకాన్ని ధరిస్తే జీవితంలో ఆహారానికి కొరత ఉండదు. విష్ణువు కస్తూరి తిలకాన్ని ధరించడానికి కరణ తాను పోషకుడినని లోకానికి తెలియజేయడమే. అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి. కనుక విష్ణువు కూడా ఆమెయే. తనను చూసినవారి ముఖం కూడా చంద్రబింబమేమో? అందులో ఉన్న కస్తూరీ తిలకం మచ్చ ఏమో అనే అనుమానం కలిగిస్తూ, చూసేవారికి ఆహ్లాదాన్ని ఇచ్చే తల్లిగా ఈనామంలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని వర్ణించడం వాళ్ళ సందేహ నివారకం ఈనామం అంటాడు ఈశ్వరుడు. అదేమిటో కొంతమందికి అన్నీ అనుమానాలే. అన్నం తినడానికి సందేహమే! నిద్రపోవడానికి సందేహమే! ఈ సందేహాలు తీరకపోతే మానవుడు నశించి పోతాడు. "సంశయాత్మా వినశ్యతి" అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు అన్నాడు. కాబట్టి మానవుడిని పట్టి పీడించే సందేహాలను నివృత్తి చేసే మంచి గురువు కావాలి. ఈమంత్రం అటువంటి గురువు.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః"
నిత్యం 11 సార్లు ఈమంత్రాన్ని శ్రద్దగా జపిస్తే మన విద్యాభ్యాసంలో, జీవితంలో వచ్చే సందేహాలకు ఏదో ఒకరూపంలో సమాధానం లభిస్తుంది. ముఖ్యంగా మన జీవితంలో ఏ ఉద్యోగంలో చేరాలో నిర్ణయించుకోలేనివారు, వివాహసమయంలో ఒక సంబంధం మంచిదో కాదో తెలియక బాధపడేవారు 40 రోజులపాటు ఈమంత్రాన్ని రోజుకి 108 సార్లు చప్పున జపిస్తే మనకు సరైన గమ్యం అమ్మవారు సూచిస్తుంది. జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవాలని కోరేవారు రోజూ 11 సార్లు చొప్పున ఒక సంవత్సరం ఈమంత్రాన్ని జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదిహేడవ నామం : వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation