శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదహరవ నామం : ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా
"ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః"
భాష్యం
దేవి ముఖము చంద్రబింబమువలె ఉన్నది.
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా పరిక్షీణామధ్యే పరిణతశరశ్చంద్రవదనా
అన్నారు శంకరభగవత్సాదులు తమ సౌందర్య లహరిలో. పరిణిత శరశ్చంద్రవదనా. శరత్కాలములో ఉన్నటువంటి పరిణితి చెందిన అనగా శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువలె పరమేశ్వరి ముఖమున్నది. అయితే ఆ వింబములో చిన్న మచ్చ కనిపిస్తోంది. ఏమిటది.
కస్తూరీ తిలకం లలాట ఫలకే
మృగనాభి విశేషము. కస్తూరి మృగము యొక్క బొడ్డు దగ్గర నుంచి వచ్చిన పదార్ధము. అదే కస్తూరి. దేవి నుదుటన కస్తూరి తిలకము ధరించి ఉన్నది. అది చూడటానికి చంద్రునిలో మచ్చలాగా కనిపిస్తోంది. చంద్రబింబంలో కళంకము అనేది సహజమైనది. చంద్రుడు మనస్సుకు అధిదేవత. మానవుడి మనసు కళంకం కావటం సహజం. అందుచేతనే లోకంలోని మానవుల మనసులాగానే చంద్రబింబం కూడా కళంకమైనది అని చెప్పబడింది. ఆ కళం కానికి గుర్తుగానే దేవి నుదటన కస్తూరి తిలకమున్నది. అందుకే సకుంకుమవిలేపనా మలళికచుంబికస్తూరికాం। అని చెప్పటం జరుగుతుంది.
చంద్రుడు షోడశకళాయుకుడు. పరమేశ్వరి ముఖము చంద్రునితో పోల్చబడింది.
అంటే అది పదహారు అక్షరాలు గల షోడశాక్షరీ మహామంత్రము అని గుర్తించాలి.
శంకరభగవత్సాదులు తమ సౌందర్య లహరిలోని 44వ శ్లోకంలో
తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ
పరీవాహస్రోత స్స రణి రివ సీమన్తసరణిః
వహస్తీ సింధూరం ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృందై ర్చందీకృత మివ నవీనార్మకిరణమ్ ॥॥
ఓ తల్లీ ! నీ వదనము సౌందర్య ప్రవాహము ప్రవహించు మార్గము లాగా ఉన్న నీ సీమంతరేఖ మిక్కిలి బలముగల కేశపాశముల సముదాయములచే బందిగొన్న బాల భానుని కిరణమువలె సింధూరపుబొట్టును ధరించినదై మాకు క్షేమము కలుగచేయుగాక.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below