శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ నామం : అష్టమీచంద్ర విభ్రాజపదళిక స్థల శోభితాయ
"ఓం అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితాయై నమః"
అమ్మవారి నుదిటి ప్రాంతం అష్టమినాటి చంద్రునిలాగా చాలా అందంగా శోభిస్తుంది. పాఢ్యమి నుండి చంద్రుడు పూర్ణిమ వరకు అభివృద్ధి చెందుతాడు. అష్టమి మధ్య రాత్రి ఆనాటి చంద్రుడు సమానమైన అర్ధభాగంలో ప్రకాశిస్తాడు. అనగా అర్ధచంద్రుడు ఎక్కువ తక్కువలు లేకుండా ఉంటాడన్నమాట. ఆ చంద్రుని దర్శనం వల్ల మనలో కళాసక్తి శక్తి పెరుగుతాయని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మవారికి అష్టమి, నవమి చతుర్దశి ఈ మూడు తిథులు చాలా ఇష్టమైనవని మార్కండేయ పురాణంలో దేవీసప్తశతిలోని నాల్గవ శ్లోకం వల్ల తెలుస్తుంది. అందుకే ఆనాటి చంద్రుని రేఖలో తన షోడశ కళలు ఉంటాయని, తన నుదుటిని అర్ధచంద్రాకారంలో ఊహించి తన ముఖం చూసి, తనను ధ్యానించిన వారిని సర్వకళలతో విరాజిల్లే వ్యక్తిగా తీర్చిదిద్దుతానని అమ్మవారు స్వయంగా హయగ్రీవునితో చెప్పింది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం వంటి కళలలో అభివృద్ధి పొందగోరేవారికి ఈమంత్రం గొప్పవరం.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితాయై నమః"
ఈమంత్రాన్ని 72 రోజుల పాటు రోజూ 27 సార్లు పారాయణ చేసేవారికి సంగీతంలో పాండిత్యం లభిస్తుంది. దేశవిదేశాలలో సంగీత విశ్వంసులుగా కీర్తి తెచ్చుకుంటారు. ధనమూ సంపాదించగలుగుతారు. 90 రోజులు రోజూ 30 సార్లు చొప్పున ఈమంత్రజపం చేస్తే నాట్యవిద్వాంసులు అవుతారు. సంవత్సరకాలం రోజూ 108 సార్లు ఈజపం చేస్తే మహాకవిత్వ శక్తి వస్తుంది. చిత్రలేఖనంలో గొప్పవారు కావాలనుకున్నవారు రోజు 27 సార్లు చొప్పున 81 రోజులు జపించాలి. గణిత శాస్త్రంలో పాండిత్యం పొందాలనుకునేవారు ఈమంత్రాన్ని 126 రోజులు రోజుకి 81 సార్లు చేస్తే తిరుగులేని పాండిత్యం లభిస్తుంది. శాస్త్రవిజ్ఞానానికి నిత్యం 11 సార్లు జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదహరవ నామం : ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation