శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ నామం : అష్టమీచంద్ర విభ్రాజపదళిక స్థల శోభితాయ
"ఓం అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితాయై నమః"
భాష్యం
చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.
అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో
అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.
దేవతల తలమీద కిరీటం ఉంటుంది. కాబట్టి ఆమె ముఖము అర్ధచంద్రాకారంగా కనిపిస్తుంది. ఇది అష్టమినాటి చంద్రుడికి ప్రతీక.
చంద్రుడికి పదహారు కళలున్నాయి.
దర్శ్భాద్యా : పూర్ణిమాంతాస్తు కళా పంచద శైవతు!
షోడశీ తు కళా జ్లేయా సచ్చిదానందరూపిణీ ॥
పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ సచ్చిదా నంద స్వరూపిణి అయి ఉన్నది.
చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేసిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన రోజును అమావస్యా అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.
తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు. వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.
శృణు దేవి! ప్రవక్ష్యామి నిత్యాషోడశకం తవ ।
న కస్యచిన్మయాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం ॥
తత్రాదౌ ప్రథమా నిత్యా మహాత్రిపురసుందరీ ।
తతః కామేశ్వరీ నిత్యా । నిత్యా చ భగమాలినీ ॥
నిత్యక్షిన్నా తథా చైవ భేరుండా వహ్బివాసినీ ।
మహావిద్యేశ్వరీ రౌద్రీ త్వరితా కులసుందరీ ॥
నిత్యా నీలపతాకా చ విజయా సర్వమంగళా
జ్వాలామాలిని చిద్రూపాః ఏతా నిత్యా స్తు షోడశ ॥
ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.
కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,
శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ,
జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య
ఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు ఈ దిగువ ఇవ్వబడ్డాయి.
శుక్లపక్షము తిథి నిత్యాదేవత కృష్ణపక్షము తిథి
1. పాడ్యమి కామేశ్వరి. 1. పాడ్యమి చిత్ర
2. విదియ భగమాలిని. 2 జ్వాలామాలిని
8. తదియ నిత్యక్షిన్న 3 సర్వమంగళ
4. చవితి భేరుండా. 4 విజయ
5. పంచమి వహ్నివాసిని 5 నీలపతాక
6. షష్టి మహావజ్రే్శ్వరి 6. నిత్య
7. సప్తమి శివదూతి 7 కులసుందరి
8. అష్టమి త్వరిత 8 త్వరిత
9. నవమి కులసుందరి. 9 శివదూతి
10. దశమి నిత్య 10. మహావజ్రేేశ్వరి
11. ఏకాదశి నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని
12. ద్వాదశి విజయ 12. ద్వాదశి భేరుండా
13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న
14. చతుర్దశి జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని
15. పూర్ణిమ చిత్ర 15. కామేశ్వరి
చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి ముఖాన్ని పోల్చటం జరిగింది.
గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.
శంకరభగవత్సాదులవారు పరమేశ్వరి ముఖారవిందాన్ని వర్ణిస్తూ సౌందర్య లహరి
లోని 46వ శ్లోకంలో
లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవ యత్
ద్వితీయం త నృన్యే మకుటి ఘటితం చంద్రశకలమ్ ।
విపర్యాసన్యాసా దుభయ మపి సమ్మూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ॥
ఓ తల్లీ ! లావణ్యము అనే వెన్నెల చేత ప్రకాశిస్తున్న కిరీటం ధరించినటువంటి నీ లలాటాన్ని రెండవ చంద్రబింబముగా తలచెదను. నీ సిగపూవు అర్ధచంద్రము, లలాటము అర్ధచంద్రము. ఆ రెండూ కలిసి పూర్ణచంద్రబింబముగా ప్రకాశిస్తున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below