శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదనాల్గవ నామం : కురువింద మణి శ్రేణి లసత్కోటీర మండితా
"ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండితాయై నమః"
అమ్మవారి కిరీటం నిండా కురువింద మణులు, వరుసగా కూర్చబడి ప్రకాశిస్తున్నాయి. అమ్మవారి శరీర కాంతి అరుణవర్ణమే. కిరీటంపై ఉన్నవీ ఎఱ్ఱని కెంపులు. "కామానురాగః కురువిందజేషు" అంటారు. శ్రీకృష్ణుడు. కురువిందమణులు ఎఱ్ఱగా ఉండి (తెలుగులో వీటినే కెంపులు అంటారు) కామాన్ని అనురాగాన్ని పెంపొందింపజేస్తాయి. గరుడపురాణంలో వీటిని ధరిస్తే హరిభక్తి పెరుగుతుందని ఉంది. హరిభక్తి వలన కీర్తి, సంపదలు లభిస్తాయి. శిరోమణి అయ్యే భాగ్యం కురువిందమణులకు ఉంది గనుక ఆ మణులను కిరీటంపై ధరించిన అమ్మను ధ్యానిస్తే తన సాటివారిలో గొప్పవారవుతారు సాధకులని మార్కండేయుడు అంటాడు. సమానానాముత్తమ శ్లోకోస్తు అని మన పెద్దలు దీవిస్తుంటారు. అనగా తన సాటివారిలో గొప్పవాడవు కావాలని ఈ ఉపనిషద్ వాక్యార్ధం.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండితాయై నమః"
ఉద్యోగాలు చేసేవారికి తన సాటివారిలో గుర్తింపులేదనే భావన ఉన్నవారు ఈ మంత్రాన్ని నిత్యం 9సార్లు జపిస్తే అద్భుతమైన గుర్తింపు కీర్తి లభిస్తాయి. పదోన్నతి కోరుకునేవారు 6నెలలు ఈమంత్రాన్ని రోజూ 27 సార్లు చొప్పున చేస్తూ అమ్మవారికి ఆవుపాలు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఆలా చేస్తే తప్పక విజయం లభిస్తుంది. అన్నింటికన్నా మోక్షం చాలా గొప్ప పదవి. ముక్తి కోరుకునేవారు ఈమంత్రాన్ని నిత్యం 11 సార్లు జపిస్తే చాలు మోక్షం కరతలామలకం అవుతుంది. కుజదోషం ఉన్నవారు ప్రతి మంగళవారం ఈమంత్రాన్ని 108 సార్లు జపిస్తే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణదోషం తొలగుతుంది. వేళకి ఆహారం లభించే యోగం లేనివారు దీనిని నిత్యం 27 సార్లు జపిస్తే ఆహారయోగం పొందుతారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదిహేనవ నామం : అష్టమీచంద్ర విభ్రాజపదళిక స్థల శోభితాయ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation