శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదమూడవ నామం : చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
"ఓం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః"
చంపకం అంటే సంపంగి. పున్నాగం అంటే సొరపొన్న, సౌగంధికం అంటే ఎఱ్ఱకాలువ. కలువజాతికి చెంది చాలా రేకులతో ఉండి సౌగంధికం అని పిలువబడే పుష్పాలు హిమాలయాలలో ఇప్పటికీ ఉన్నాయి. చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలతో ప్రకాశించే కొప్పుతో అమ్మ దర్శనం ఇస్తుంది. శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి కవి సత్కీరోపాఖ్యానంలో ఒకవిశేషాన్ని వర్ణించాడు. శివుడు ఒకానొక అర్చకునికి కొన్ని కవితలు వ్రాసి ఇచ్చాడు. ఆ కవితలలో ఒకటి ఇది. సింధుర రాజగమనా ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు - అనగా ఒకానొక ఉత్తమ సుందరి జుట్టు సహజ సువాసనతో ఉంది. అని భావం. అమ్మవారి కేశములు పైన చెప్పిన పూలవాసనలతో కూడినవి అనీ, అసలా పూలకు కూడా అమ్మవారే తమ కేశాలలో ధరించడం ద్వారా సుగంధాన్ని ఇచ్చిందని అంతరార్ధం. సకల పాపాలూ కేశాలను ఆశ్రయిస్తాయి. కేశాలను సుగంధం అంటే పాపారాహిత్యం. పవిత్ర తత్త్వం. మహాపుణ్య సంపద ఉంటె జుట్టు సుగంధాన్ని వెదజల్లుతుంది. అందువల్ల అమ్మవారు నా కేశాలను స్మరించండి. మీ పాపాలను కడిగేసుకొని సద్భుద్ధిని పొందండి అని చెబుతున్నది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః"
"పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే" అనగా పూర్వజన్మలో చేసిన పాపం రోగంరూపంలో బాధిస్తుంది. రోగాలు తొలగాలంటే ముందు పాపాలు తొలగాలి. దానికి ఈమంత్రం తిరుగులేనిది. ఈ మంత్రాన్ని 90 రోజులపాటు రోజూ 108 సార్లు చేస్తే దీర్ఘరోగాలు నయమౌతాయి. 41 రోజులు జపిస్తే తీవ్రపాపాలు తొలగుతాయి. పిల్లిని చంపినా పాపం గుడికట్టిస్తే గాని పోదని నానుడి. అటువంటి మహాపాపాలకు ఒక సంవత్సర కాలం ఈ మహామంత్రజపం చేయడం నిజమైన నిష్కృతి. పిల్లలు దారితప్పి ప్రవర్తిస్తున్నప్పుడు వారిచేత ఈమంత్రాన్ని 90 రోజులు రోజూ 108 సార్లు చేయిస్తే చాలు వారు సత్ప్రవర్తన అలవరచుకుంటారు. ఎవరి మీదనైనా ఈర్ష్య పెంచుకునేవారు, ఈ మంత్రాన్ని రోజూ 11 సార్లు జపిస్తే ఆ దుర్గుణం తొలగి ప్రశాంతంగా జీవిస్తారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదనాల్గవ నామం : కురువింద మణి శ్రేణి లసత్కోటీర మండితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation