శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదమూడవ నామం : చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
"ఓం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః"
భాష్యం
పరమేశ్వరి అగ్నికుండము నుండి ఆవిర్భవించింది. కాబట్టి ముందుగ తలపైకి వచ్చింది. అందుచేతనే దేవిని వర్ణించేటప్పుడు పాదాల దగ్గరనుండికాక తల దగ్గరనుండి వర్ణించటం జరుగుతుంది.
ఇక్కడ ముందుగా దేవి కేశాలను వర్ణించటం జరుగుతోంది. ఆ పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు దేవతలందరి శక్తులతోను ఆమె ఉద్భవించింది. అప్పుడు
యామ్యేన చా భవన్ కేశా, బాహవో విష్ణు తేజసా
యముని యొక్క తేజస్సుతో వెంట్రుకలు వచ్చినాయి. ఆ కేశాలు సంపంగి, అశోకము, పున్నాగము మొదలైన పూలవాసనలతో గుబాళిస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే దేవి ఆ పూవులను ధరించటంవల్ల, వెంట్రుకలకు ఆ సువాసన రాలేదు. దేవి ధరించటంచేతనే పూలకు ఆ వాసన వచ్చింది. అంటే దేవి కేశపాశములు సహజ సుగంధములు. విశ్వరూప వర్ణనలో వనస్పతులే దేవి కేశపాశాలయినాయని చెప్పబడింది. దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని 87వ శ్లోకంలో దేవి కురులను శ్లాఘిస్తూ
జాతీ చంపక కుంద కేసర రజో గంధోత్మిర త్య్మేతకీ
నీపాశోక శిరీష ముఖ్యకుసుమైః ప్రోప్తంసితాధూపితా
ఆనీలాంగన తుల్య మత్త మధుప శ్రేణీవ వేణీ తవ
శ్రీమాతః ! శ్రయతాం మదీయ హృదయామ్భోజం సరోజాల యే ॥
ఓ తల్లీ ! సంపెంగ, మొగలి, మొల్ల, కడిమి, అశోక, దిరిశెన మొదలైన పూలు అలంకారములుగ గలిగి అగరు మొదలైన ధూపములు వేయబడి దట్టమైన నీలవర్ణముగల, కాటుకతో సమానమైన, తుమ్మెదల వరుసవలె ప్రకాశించే నీ కురులు నా హృదయ పద్మమును ఆశ్రయముగా చేసుకొని ఉండాలి. అంటే నీ యొక్క వేణిని నేను భావన చేస్తున్నాను అన్నాడు. సౌందర్య లహరిలోని 48వ శ్లోకంలో శంకరభగవత్సాదులవారు
ధునోతు ధ్వాన్తం న స్తులితదళితేన్దీవర వనం
ఘనస్పిగ్ధశ్రక్షం చికురనికురుంబం తవ శివే !
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో
వస న్య్యస్మి న్మ్నన్యే వలమథనవాటీ విటపినామ్ ॥
తల్లీ ! వికసించుచున్న నల్లకలువల తండమును దీటుగా చేసుకున్నది, కారుమబ్బుల వలె దట్టమైన, చిక్కనైన, నునుపైన సుగంధితైలముతో కూడుకొన్నదాని లాగా మెత్తదనము గలది అగు నీ కురుల జడ మా అజ్ఞానాన్ని పోగొట్టుగాక, అమ్మా ! నీ కేశపాశము యొక్క సహజ సౌరభమును ప్రాపించుటకు దేవేంద్రుని నందనోద్యానమందలి కల్పవృక్షముల పుష్పములు నీ కేశసముదాయము నాశ్రయించి ఉన్నాయి.
పంచదశీ మహామంత్రంలో మూడు భాగాలున్నాయి. వాటిని విడివిడిగా మూడు కూటములు అంటారు. అవి. 1. వాగ్భవ కూటమి. 2. కామరాజకూటమి 3. శక్తికూటమి. మానవదేహం కూడా ఈ రకంగానే మూడు కూటములుగా విభజించబడింది. అందులో తలభాగాన్ని వాగ్బవ కూటమి అంటారు. హోమకుండము నుంచి వచ్చేటప్పుడు ముందుగా వాగ్బవ కూటమి ఆవిర్భవించింది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below