శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పన్నేండవ నామం : నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండలా
"ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః"
అమ్మవారు అరుణ వర్ణంతో ప్రకాశిస్తుంది. ఆ కాంతి లోకాలపై ప్రసరిస్తోంది. ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమర్జనం అయిపోయినట్లు కనబడుతుంది. అనగా అమ్మవారి శరీరం నుండి వస్తున్న కాంతి తప్ప ఇంకా లోకాలు కనబడని అద్వైత స్థితి అన్నమాట. తన కాంతితో లోకాలన్నీ నిండేలా చేస్తుందంటే అమ్మవారి శరీరకాంతి ఎంత శక్తివంతమైనదో గ్రహించవచ్చు. కణకణలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మకూడా అలాంటి రంగులో ఉంటుంది. అందుకే వేదం అమ్మవారిని "తామగ్ని వర్ణాం తవసాజ్వలంతీమ్" అని వర్ణించింది. ఈ అరుణ కాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమ్మవారి శారీరకాంతిని మానసికంగా దర్శించేవాడికి స్వస్థత వచ్చి తీరుతుందని శివుడు స్వయంగా తెలియజేశాడు. గుణరూప కర్మలు లేని అమ్మవారు లోకశ్రేయస్సు కోసం గుణరూపకర్మలు కలిగిన చైతన్యమూర్తిని ధరించి ఉదయిస్తున్న సూర్యకాంతిని శరీరవర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాలను తొలగిస్తున్నదని కాళికా పురాణం చెబుతున్నది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః"
రోగాలలో కుష్ఠు భయంకర రోగం.ఈరోగ నివారణకు ఈ మంత్రం అద్భుతమైన ఔషధం. సంవత్సరకాలం ఈమంత్రాన్ని సూర్యోదయం సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి లేక కూర్చుని 108 సార్లు జపిస్తే కుష్ఠురోగం పూర్తిగా తొలగిపోతుంది. ఒంటికి తెల్లమచ్చలు అనే రోగం వచ్చి శరీర సౌందర్యాన్ని పాడుచేస్తుందని చాలామంది ఈమధ్యకాలంలో దుఃఖిస్తున్నారు. దానికి కూడా ఈమంత్రాన్ని పైన చేవూరిన రీతిలో సంవత్సరకాలం జపిస్తే నయమౌతుంది అని చరకుడు "చరక సంహిత"లో తెలిపాడు. మానసిక చాపల్యం ఉన్నవారు ఈమంత్రాన్ని ఒక మండలం పాటు రోజుకు 108 సార్లు జపిస్తే చాంచల్యం తొలగి నిలకడ వస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదమూడవ నామం : చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation