శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పన్నేండవ నామం : నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండలా
"ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః"
భాష్యం
అరుణ కాంతులలో మునిగినటువంటి బ్రహ్మాండములు గలది. అంటే ప్రాతః కాలములో ఏ రకమైన కాంతులు ఉంటాయో అటువంటి కాంతులు గలది. వేదాలలో తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం అని చెప్పబడింది. ఆ దేవి అగ్నివర్ణములో ప్రకాశిస్తుంటుంది. అలాగే ఆదిత్యవర్ణే తపోసోదిజాతో అన్నారు. ఆదిత్యుడు అంటే బాలభానుడు. ఆరవనామంలో ఆమె “ఉద్యద్భానుసహ్రాభా” అని చెప్పబడింది. అంటే ఉదయిస్తున్న కొన్నివేల సూర్యులకాంతి గలది. ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణము గలది. ధ్యాన
శ్లోకంలో అరుణాంకరుణా తరంగితాక్షీం. అని సింధూరారుణ విగ్రహాం అని చెప్పబడింది. ఆ పరమేశ్వరి మంకెన్నపూవ్వులాగా ఎర్రని కాంతులు విరజిమ్ముతుంటుంది. అందుకే సకుంకు విలేపనా........... జపాకుసుమభాసురాం... అని చెప్పబడుతోంది. అలాగే జపాకుసుమసంకౌసౌ మధుఘూర్జితలోచనౌ అని శివశక్తులను ధ్యానంచేస్తున్నారు. వీటన్నింటివల్ల దేవి అరుణారుణచ్చాయతో ప్రకాశిస్తున్నదని తెలుస్తోంది. పరమేశ్వరి తన దేహకాంతులతో బ్రంహ్మాండాలన్నీ ముంచివేస్తోంది. “దేవి చిదగ్నికుండ సంభూత” కాబట్టి ఆమె దేహము నుండి కాంతులు ప్రసరిస్తున్నాయి. ఆమె “నిజారుణప్రభాపూర” అంటే ఆమె దేహానికి ఉన్న కాంతికిరణాలు స్వతహాగా ఉన్నవే కాని సూర్యకాంతివల్లగాని, అగ్ని తేజమువల్లగాని, ఇతర కారణాలవల్లగాని వచ్చినవికావు. ఈ జగత్తులో కాంతులను ప్రసరించే పదార్థాలన్నీ ఆ దేవి శరీరం నుంచి గ్రహించినవే. ఈ విషయాన్ని గతంలో వివరించటం జరిగింది. దేవి శరీరం నుంచి అనేకకోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. వాటిలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 186 కిరణాలను తీసుకున్నారు. ఈ
జగత్తు పగటిపూట సూర్యుని వెలుగులచేత, రాత్రులందు చంద్రకిరణములచేత, సంధ్యవేళల యందు అగ్నివల్ల ప్రవర్తిల్లుతున్నది. ఈరకంగా పబ్రహ్మాండమంతా ఆమెవల్లనే (ప్రకాశిస్తున్నది. అంతేకాని ఆమెకు కాంతిని, ప్రకాశాన్ని ఇచ్చే శక్తి మరి దేనికీ లేదు. ఆమె స్వయంప్రకాశ రూపిణి. పరమేశ్వరి కాంతిమండలము చాలాపెద్దది. ఈ బ్రహ్మాండం కన్న విశాలమైనది. పబ్రహ్మాండముకన్న విస్తృతమైన కాంతి మండలముతో అరుణారుణకాంతులతో ఆ దేవి వెలుగొందుచున్నది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below