శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదకొండవ నామం : పంచతన్మాత్ర సాయకా
"ఓం పంచతన్మాత్రసాయకాయై నమః"
భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనబడేవి పంచభూతాలు. వీటి తన్మాత్రలు అనగా భూమి - గంథం, అగ్ని - రూపం, జలం - రసం, వాయువు - స్పర్శ, ఆకాశం - శబ్దం. ఈ ఐదింటిని పుష్పబాణాలుగా అమ్మవారు తన చేతిలో ధరించింది. తామరపూవు, శోకం, చూతము(మామిడి పువ్వు), నవమల్లిక, నల్లకలువ. ఇవీ ఆ పుష్పబాణాలు. వీటికే హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం అని పేర్లు. వీటితో అమ్మ సమస్తలోకాలు నడుపుతుంది. మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది. అందుకే పాంచభౌతిక శరీరం అంటారు. వీటిలో ఎక్కువగా, ఒక్కొక్కటి తక్కువగా ఉండడం వల్లే అవయవాలలో లోపాలు ఏర్పడుతుంటాయి. తన్మాత్రల లోపాల వల్ల చెవుడు, చర్మరోగాలు, దృష్టిదోషాలు, జీర్ణసంబంధ రోగాలు, ఉష్ణరోగాలు వస్తూ ఉంటాయి. ఇక పుష్పబాణాలు అనగా వాసనలు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని బట్టి పూర్వజన్మ కర్మలను బట్టి ఒక్కొక్క వ్యసనం వైపో, లేక వస్తువు వైపో ఆకర్షించబడి సుఖదుఃఖాలు పొందుతూ ఉంటుంది. కాబట్టి సుఖదుఃఖాలకు రోగాలకు మూలం పంచతన్మాత్రల సమతుల్యం లోపించడమే. వాటికి విరుగుడు ఈమంత్రం.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం పంచతన్మాత్రసాయకాయై నమః"
27 రోజులపాటు ఈమంత్రాన్ని ప్రతినిత్యం 100 సార్లు జపిస్తే చెవుడు, చర్మవ్యాధులు, 41 రోజులపాటు జపిస్తే దృష్టిదోషం తొలగుతుంది. అజీర్ణ వ్యాధులున్న వారు తిన్నది సహించక బాధపడేవారు మొదటి అన్నం ముద్ద చేతబట్టుకొని ఈమంత్రం 11 సార్లు జపించి ఆపై భుజిస్తే ఆరోగాలు తొలగి తిన్నది హాయిగా జీర్ణమౌతుంది. వికారం తగ్గుతుంది. వయస్సులో ఉన్నప్పుడు క్షణికాకర్షణలతో జీవితం పాడుచేసుకునేవారు ఈనాడు ఎక్కువగా ఉన్నారు. అలాంటివారు ఈమంత్రాన్ని రోజూ 18 సార్లు జపం చేస్తే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. తరుచూ దుఃఖం పొందేవారు రోజు 14 సార్లు ఈమంత్రం జపిస్తే దుఃఖం తొలగి సుఖం లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పన్నెండవ నామం : నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండలా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation