శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదకొండవ నామం : పంచతన్మాత్ర సాయకా
"ఓం పంచతన్మాత్రసాయకాయై నమః"
భాష్యం
ఈ నామంలో దేవి చేతిలోని బాణాలను వివరిస్తున్నాడు. పరమేశ్వరి చేతిలో ఐదుబాణాలుంటాయి. అవి. పంచసంఖ్యాని తన్మాత్రాణి శబ్దాదీని విషయాః, త దేవ తన్మాత్రమ్, తన్మాత్రలు ఇవి ఐదు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పంచభూతాల యొక్క సూక్ష్మరూపాలు. వీటివల్లనే భూతపంచకము సృష్టించబడింది. సృష్టి ప్రారంభం కాకముందు కృతయుగానికి ఆరంభంలో నిరాకారుడు నిర్ణుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ బిందు రూపంలో ఉండేవాడు. గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వము కాకుండా తనలో లీనమైనటువంటి జీవరాసులన్నింటికి వాటి కర్మను క్షయం చేసి, వాటికి ముక్తి కలిగించాలనే కోరికతో మళ్ళీ సృష్టి ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పుడు తన నుంచి కొంతశక్తిని బయటకు పంపాడు. అదేశక్తి. విమర్శాంశ. ఆ శక్తి నుండే ఈ జగత్తంతా ఉద్భవించింది. ముందుగా శబ్ద స్పర్శ రూప రస గంధాలనబడే తన్మాత్రలు ఆవిర్భవించాయి. వాటి నుంచి పంచభూతాలయిన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము ఉద్భవించాయి. ఈ రకంగా పంచభూతాలు తన్మాత్రల నుంచి ఆవిర్భవించాయి. సృష్టి మొత్తం తన్మాత్రల నుంచి ఆవిర్భవించింది. సృష్టి మొత్తం తన్మాత్రల ఆధారంగానే జరిగింది. అది ఎలాగంటే
పంచభూతాలు, తన్మాత్రలు కూడా పంచీకరణం చెందాయి. ఇవి గుణత్రయంతో కలియటం
చేత సృష్టి జరిగింది. ఈ రకంగా సృష్టికి ఆధారమైనవి తన్మాత్రలు. ఆ తన్మాత్రలు బాణాలుగా పరమేశ్వరి కుడిచేతి యందు ఉంటాయి. వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా
శబ్ద స్పర్శా దయో బాణాః మన స్తస్యా౭. భవద్ధనుః
శబ్ద స్పర్శాదులే బాణాలు. మనస్సే ఆమె ధనుస్సు. కాదిమతంలో బాణాలు మూడురకాలు అని చెప్పబడింది.
బాణా స్తు త్రివిధా ప్రోక్తాః స్థూల సూక్ష్మ పరత్వతః ।
స్థూలాః పుష్పమయాః సూక్ష్మాః మంత్రాత్మనః సమీరితాః
పరా శ్చ వాసనాయాం తు ప్రోక్తా
బాణాలు మూడురకాలు :- 1. స్థూలములు 2. సూక్ష్మములు 8. పరములు
1 స్థూలములు పుష్పమయములు
2. సూక్ష్మములు గా మంత్రాత్మకములు
3. పరములు గ వాసనామయములు (ఆం ఈం ఊం)
కమలం కైరవం రక్తం కల్పారేస్టీవరే తథా ॥
సహకారక మిత్యుక్తం పుష్ప్రపంచక మీశ్వరీ!
కమలము - ఎర్రతామర
రక్తకైరవము - ఎర్రకలువ
కల్హారము - తెల్లకలువ
ఇందీవరము - నల్లకలువ
సహకారము మామిడిపూవు
ఇవి వసంత బూుతువులో తాపాన్ని రేకెత్తించేవి. కాలికాపురాణంలో ఈ బాణాలను వివరిస్తూ
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా !
మారణం చే త్యమీ బాణా మునీనా మపి మోహదాః ॥
హర్షణము - హర్షము కలుగచేయునది
రోచనము - ప్రకాశింపచేయునది
మోహనము - మోహమును కలిగించునది
శోషణము - ఎండించునది, శోషిల్ల చేయునది
మారణము - నశింపచేయునది
ఇవి మునీశ్వరులకు కూడా మోహము చేకూరుస్తాయి.
జ్ఞానార్దవతంత్రంలో ఈ బాణాలను
క్రోభణం ద్రావణం దేవి ! తథాకర్షణ సంజ్ఞకం ॥
వశ్యోన్మాదౌ క్రమేణైవ నామాని పరమేశ్వరి! ॥
క్రోభణము - క్షోభమునకు సాధనమైనది
ద్రావణము పారద్రోలునది, కరిగించునది
ఆకర్షణము _ ఆకర్షణ సాధనమైన కర్మ విశేషము
వశ్యము - వశము చేసుకోతగినది.
ఉన్మాదము - ఉన్మధనము, పీడించునది, చంపునది
ఇవి శత్రుసంహారానికి ఉపయోగిస్తాయి. తంత్రరాజములో ఆ బాణాలను
మదనోన్మాదనౌ పశ్చా త్తథా మోహనదీపనౌ ॥
శోషణ శ్చేతి కథితా బాణాః పంచ వురోదితా ॥
మదనము న వసంతకాలము
ఉన్మాదము - పీడించునది, చంపునది
మోహనము గా మోహమును కలిగించునది
దీపనము గా రగుల్చునది, ప్రేరేపించునది
శోషణము _ ఎండించునది, శోషింపచేయునది
విరాగులకు కూడా తాపాన్ని కలుగచేసే సాధనాలు. పరమేశ్వరి చేతిలోని బాణాలు మదనతాపాన్ని పెంచేవి. ద్రాం ద్రీం క్లీం బ్లూం సః అనేవి వీటి బీజాలు.
ఓం నమో భగవతే కామదేవాయ, ద్రాం ద్రాం ద్రావణ
బాణాయ, ద్రీం ద్రీం సందీపనబాణాయ, క్షీం క్షీం
సమ్మోహన బాణాయ, బ్లూం బ్లూం సంతాపనబాణా
య, సః సః వశీకరణబాణాయ, ట్రీం హ్రీం మదనా
వేశయావేశయ, సకలజనచిత్తం ద్రావయ ద్రావయ
కంపిత కపిత హుంఫట్ స్వాహా ॥
ఓంకారాన్ని ప్రణవము అంటారు. ప్రణవసహితమైన మంత్రాలే వైదికమంత్రాలు. అవే మోక్షకారకాలు. ప్రణవంలేని మంత్రాలు తాంత్రికాలు
వైదికా ప్రణవైర్యు తాః । ప్రణవేన్యఃవిహీనం తు తాంత్రికా ఏవ ప్రకీర్తితాః
వేదమంత్రాలకు, మహామంత్రాలకు అన్నింటికీ ముందు ఓంకారముంటుంది. ఓం నమశ్శివాయ, ఓం నమోనారాయణాయ. అయితే పరమేశ్వరి మంత్రమైన షోడశిలోగాని, పంచదశిలోగాని ఓంకారముండదు. కాబట్టి ఇది మహామంత్రంకాదని, తాంత్రికమని ఒక వాదన ఉంది. అది నిజంకాదు. శాస్త్రం తెలియకుండా చెప్పే మాటలవి. పంచదశీ మహామంత్రానికి అర్ధం సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు అని. షోడశిలో కూడా పంచదశి మహామంత్రం పునరావృతమవుతుంది. కాబట్టి షోడశిమంత్రానికి కూడా అర్ధం పరమేశ్వరుడు అనే. అదీగాక ఓంకారాన్ని ప్రణవము అంటారు. అలాగే శక్తిప్రణవాలు ఐదున్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః పరమేశ్వరి మంత్రాలయిన బాల, షోడశిలలో ఇవి ఉంటాయి. అందుచేతనే అవి మహా మంత్రాలయినాయి. పంచదశి షోడశిమంత్రాల మీద వివరణకు నా చే ప్రాయబడిన “శ్రీవిద్యా పంచదశి” చూడండి.
శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణలో బాణాలను పూజిస్తారు.
ఓంశ్రీంహ్రీంశ్రీయంరంలంవంసంద్రాంద్రీంక్షీంబ్లూంసః
సర్వజంభనేభ్యః। కామేశ్వరీ కామేశ్వరబాణేభ్యో నమః। బాణశక్తి ్తి శ్రీ పాదుకాం పూజయామి నమః ॥
ఇక్కడ పరమేశ్వరి చేతిలోని ఐదు బాణాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి ప్రణవాలు. ఈ రకంగా పరమేశ్వరిచేతిలోని బాణాలను ఉపాసించే వాడు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతాడు. ఆ పరమేశ్వరి కృప ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా
పాశాంకుశా తదీయౌ తు రాగద్వేషాత్మకౌ స్మృతౌ
శబ్ద స్పర్శాదయో బాణాః మనః స్తస్యాభవ ద్ధనుః
కరణేంద్రియచక్రస్థాం దేవీం సంవిత్స్వరూపిణీం
విశ్వాహంకారపుష్పేణ పూజయే త్సర్వసిద్ధిభాక్ ॥
దేవి యొక్క పాశాంకుశాలే రాగద్వేషాలు. పంచతన్మాత్రలే బాణాలు. మనస్సే ఆమెచేతిలోని ధనుస్సు. అంటే సాధకుడు రాగద్వేషాలను విడిచి, మనస్సును నిశ్చలంచేసి అహంకారమనే పుష్ప్రంతో ఆ పరమేశ్వరిని అర్చించినట్లెతే అనగా అరిషడ్వర్గాలను జయించి ఆ పరమేశ్వరిని ఆశ్రయించినట్లెతే సర్వసిదులూ పొందుతాడు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below