శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని తొమ్మిదవ నామం : క్రోధాకారాంకుశోజ్వలా
"ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః"
అమ్మవారు ఒకచేతిలో అంకుశాన్ని ధరించింది. అది మదపుటేనుగును అదుపులో పెట్టడానికి కఠినమైన ఇనుముతో తయారు చేసిన శూలం వంటి వస్తువు అంకుశం. కాకపోతే అమ్మవారి చేతిలో అంకుశం క్రోధాకారం. క్రోధమే అంకుశమయిందట. ఎందువల్ల క్రోధారంకుశరూపం ధరించిందో అమ్మవారే స్వయంగా చెప్పింది. హయగ్రీవునాకు మఱియు నాస్తిక మార్గంలో ప్రయాణించేవారిని పాషండులను పరమ పాపాత్ములను అదుపులో పెట్టడానికి అమ్మవారు క్రోధాన్ని ఆవేశింపజేసుకుంది. నిజానికి కోపం పొరబాటున కూడా చూపించని శాంతస్వరూపిణి అమ్మ. కానీ దుష్టశిక్షణ కోసం కోపం తెచ్చుకుంటున్నది. ఆ క్రోధమే అంకుశం. ఆ అంకుశం చేతిలో పట్టుకొన్న నన్ను ధ్యానిస్తే మీకు క్రోధం రానివ్వనని అమ్మవారు స్వయంగా తెలియజేశారు. అంకుశం జ్ఞానశక్తి స్వరూపమైన ఈ మంత్రాన్ని తరచుగా జపిస్తే కోపం అదుపులోకి వస్తుంది. క్రోధం వాళ్ళ తపస్సు, పేరు, జ్ఞానం అన్ని నశిస్తాయి. మన అనారోగ్యాలకు మూలకారణం క్రోధమే.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః"
ఉదయం 7నుండి 8గంటల మధ్యలో ఈమంత్రాన్ని 41 రోజులపాటు రోజుకి 108 సార్లు జపిస్తే క్రోధం తొలగుతుంది. రక్తపోటు, మధుమేహం అనబడే రెండు రోగాలు మానవులను సర్వనాశనం చేస్తున్నాయి. ఈరోగాలు తొలగడానికి అమ్మవారి ఆలయంలో 27 ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణ సమయంలో ఈమంత్రాన్ని లెక్కలేకుండా జపిస్తూ ఒక 90 రోజులు దీక్షను నడిపితే ఆరోగ్యం వస్తుంది. రోగాలు సమూలంగా నశిస్తాయి. ప్రయాణకాలంలో ఈమంత్రాన్ని ఇంతా అని సంఖ్యా నిర్దేశం లేకుండా జపిస్తే ప్రయాణంలో ఏ అనారోగ్యం చెంతకురాదు. ఈమంత్రం జ్ఞానశక్తిని కూడా పెంచుతుంది. దీనిని పగటిపూట చేస్తే అధిక ఫలితం వస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదవ నామం : మనోరూపేక్షు కోదండా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation