లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0007 ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
చతుర్బాహు సమన్వితా : నాలుగు భుజాలతో ప్రపంచాన్ని రక్షించు తల్లికి నమస్కారము.
Chathur Baahu Samanvithaa : She who has four arms. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0007 ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
చతుర్బాహు సమన్వితా : నాలుగు భుజాలతో ప్రపంచాన్ని రక్షించు తల్లికి నమస్కారము.
Chathur Baahu Samanvithaa : She who has four arms. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
"ఓం చతుర్బాహుసమన్వితాయై నమః"
దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది. ఈ రూపాలలో ఉత్తమ రూపం శ్రీ లలితా పరాభట్టారిక. ఈతల్లి నాలుగు చేతులతో దర్శనం ఇస్తుంది. నాలుగు వేదాలు నాలుగు చేతులని, ఈనాలుగు చేతులలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనబడే చతుర్విధ ఫల పురుషార్ధాలు ప్రసాదిస్తుందని దుష్టసంహారం చేయడానికి ఈనాలుగు చేతులతోనూ ఆయుధాలు ధరిస్తుందని బ్రహాండపురాణం లోని శ్రీ లలితాఖ్యానం వల్ల తెలుస్తోంది. ఈనాలుగు చేతులను భక్తితో స్మరిస్తే మనస్సు, బుద్ది, చిత్త, అహంకారాలు అనబడే నాలుగూ సక్రమంగా పనిచేస్తాయి. మనసు పరిపరివిధాలా పోతూ నిలకడగా లేని వారికి ఈమంత్రం ఓ వరం.
మంత్రప్రయోగం ఫలితం
ఓం చతుర్బాహుసమన్వితాయై నమః"
దీనిని 40 రోజుల పాటు రోజుకు 108 సార్లు జపం చేస్తే మనస్సు చంచలం కాకుండా ఏకాగ్రతను నిలుపుకొంటుంది. నిలకడ లేనివారు దీనిని తప్పక జపించగలరు. ఈ మంత్రాన్ని 90 రోజులు రోజుకు 108 సార్లు చొప్పున రాత్రి 9 గంటలకు జపం చేస్తే కాళ్ళు చేతులకు ఉండే బెణుకులు, నొప్పులు తగ్గుతాయి. చిన్నపాటి బరువులు కూడా ఎత్తలేనివారు మెడ తరచుగా బెణికి నొప్పులతో బాధపడేవారు ఉదయం పూట 90 రోజుల పాటు లోలోన జపం చేస్తే ఈబాధలు దూరమౌతాయి. చేతివేళ్ళు, కాలివేళ్ళు సరిగా పనిచేయక నిప్పులతో సతమతమయ్యేవారు ఉదయం తులసిమొక్కకు ఎదురుగా నిలబడి 40 రోజులపాటు రోజుకు 108 సార్లు జపం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read ఎనిమిదవ నామం : రాగ స్వరూప పాశాఢ్యా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత