లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0007 ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
చతుర్బాహు సమన్వితా : నాలుగు భుజాలతో ప్రపంచాన్ని రక్షించు తల్లికి నమస్కారము.
Chathur Baahu Samanvithaa : She who has four arms. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0007 ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
చతుర్బాహు సమన్వితా : నాలుగు భుజాలతో ప్రపంచాన్ని రక్షించు తల్లికి నమస్కారము.
Chathur Baahu Samanvithaa : She who has four arms. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
"ఓం చతుర్బాహుసమన్వితాయై నమః"
భాష్యం
పరమేశ్వరికి నాలుగు బాహువులు ఉన్నాయి. అని ఈ నామంలో చెప్పబడుతోంది. బాహువు అంటే గ్రహించేది. దేవి తన చేతులతో వివిధరకాలయిన ఆయుధాలను తీసుకుని రాక్షససంహారం చేస్తుంది.
దేవికి మొత్తం మూడురూపాలున్నాయి. అవి
1. స్థూలరూపము: కాళ్ళు, చేతులు మొదలయిన అవయవాలు కలిగినటువంటిది.
2. సూక్ష్మ రూపము : ఇది మంత్రమయము
౩. పరారూపము : వాసనామయమైనది. మంత్రశాస్త్రప్రకారము వాసన అంటే సత్యము లేక స్వత్వము.
పరమేశ్వరికి బాహువులు ఉన్నాయి అని చెప్పటం సాకారవర్ణన. నిర్లుణబ్రహ్మకు రూపం లేదు. అప్పుడు మనస్సు, బుద్ధి, చిత్రము, అహంకారము అనే నాలుగు ఆమె బాహువులు. అలాగే నాలుగు బాహువులు నాలుగు వేదాలకు ప్రతీక. చతుర్వర్థాలకు ప్రతీక. చతురాశ్రమధర్మాలకు ప్రతీక.
చతుర్వర్ణాలు: బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. చతురాశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము, గృహస్తాశ్రమము వానప్రస్థము, సన్యాసము. స్థూలరూపంలో గనక దేవిని ధ్యానించినటైతే, ఆమెకు నాలుగుచేతులుంటాయి.
గురువు దగ్గర మంత్రోపదేశం పొంది, ఆ మంత్రాన్ని కొంతకాలం జపించి, మళ్ళీ ఆశ్వియుజ శుద్ధ నవమి నాటి రాత్రి గురువుకు నమస్కరించాలి. అప్పుడాయన హస్తమస్తక సంయోగం చేస్తాడు. దీన్నే శక్తిపాతము అని కూడా అంటారు. ఆ తరువాత చతుర్విధైక్య సంధానము, షట్బక్రబేధనము బోధిస్తాడు. అప్పుడు గురువు చెప్పిన ప్రకారము సాధన చేసినట్లెతే ఆధారచక్రంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి మేల్కొని ఆధారస్వాధిష్ట్థానాలు దాటి 'మణిపూరంలో ప్రవేశిస్తుంది. ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు. అక్కడ సమయాచారులకు పూజలేదు. శివశక్తులకు ఐదురకాలుగా సామ్యం (పోలిక) ఉన్నది అని చెప్పేవారు సమయులు. వారి ఆచారాన్ని సమయాచారము అంటారు. అవి :
1 అధిష్టానసామ్యము
2 రూపసామ్యము
3 అనుష్ట్థానసామ్యము
4 నామసామ్యము
5 అవస్థాసామ్యము
సమయాచారులు మణిపూరం నుంచే దేవిని అర్చించాలి. చతుర్విదైక్యము చేసిన వారికి మణిపూరంలో దేవి చతుర్భుజగా కనిపిస్తుంది. మణిపూరము అంటే సూర్యమండలము. అందుకే గౌడపాదులవారు
సూర్యమండలమధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం ॥
పాశాంకుశ ధనుర్బ్భణాన్ ధారయంతీం ప్రపూజయేత్ ॥
సూర్యమండలము మధ్యన తన నాలుగు చేతులయందు పాశము, అంకుశము, ధనుస్సు, బాణములు ధరించినటువంటి త్రిపురసుందరిని అర్చించాలి అన్నారు. కాళిదాసు శ్యామలాదండకంలో
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
అన్నాడు. ఆ దేవి నాలుగుచేతులతో ప్రకాశిస్తున్నది అని అర్ధం. శంకర భగవత్సాదులవారు తమ సౌందర్య లహరి లోని 7వ శ్లోకంలో
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదనా
ధనుర్భాణాన్ పాశాన్ శృణమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా
ఆ త్రిపురసుందరి నాలుగుచేతులయందు పాశము అంకుశము ధనుర్భాణములు ధరించి ప్రకాశిస్తున్నది. అంటే వీరంతా కూడా దేవి చతుర్భుజంగానే ఉంటుంది అన్నారు. చతుర్విధెక్యము చేసిన వారికి ఆ దేవి చతుర్భుజగా దర్శనమిస్తుంది. చతుర్విధెక్యము అంటే
పిండబ్రహ్మాండయో రైక్యం లింగసూత్రాత్మనో రపి
స్వాపావ్యాకృతి కారైక్యం క్షేతజ్ఞ పరమాత్మనౌ ॥
1 పిండ బ్రహ్మాండాలకు ఐక్యము
2 స్వాపావ్యాకృతులకు ఐక్యము
3 లింగసూత్రాలకు ఐక్యము
4 క్షేత్రజ్ఞ పరమాత్ములకు ఐక్యము
షడ్విధెక్యసంధానము చేసిన వారికి దేవి దశభుజగా దర్శనమిస్తుంది గౌడపాదుల వారు తమ సుభగోదయస్తుతిలోని 16వ శ్లోకంలో దేవిని వర్ణిస్తూ
భవాని ! శ్రీహస్రైః వహసి ఫణిపాశం సృణి మథో
ధనుః పౌండ్రం పౌప్పం శర మథ జపగ్రక్కు కవరౌ ॥
అథ ద్వాభ్యాం ముద్రా మభయవరదానైక రసికాం
క్వణద్వీణాం ద్వాభ్యాం త్వ మురసి కరాభ్యాం చ బిభ్యషే ॥
ఓ భవానీ ! నీ హస్తములయందు సర్పరూపపాశము అంకుశము, పుండ్రేక్షుచాపము, పుష్ప్రబాణము, జపమాల శుకవరము, వరద, అభయముద్రలు మరి రెండుచేతులయందు వీణ ధరించి ఉంటుంది అన్నారు.
ఈ రెండింటిలోను దేని ప్రకారం దేవిని అర్చించాలి? అంటే నాలుగు చేతులున్న పరమేశ్వరినా? పదిచేతులున్న దేవినా? అన్నప్పుడు ఏదైనా మాకు సమ్మతమే అన్నారు గౌడపాదులు, శంకరభగవత్సాదులు కూడా. ఐతే ఎక్కువగా పరమేశ్వరి చతుర్భుజ అనేదే ప్రచారంలో ఉన్నది.
షడ్విధైక్య సంధానము అనగా సుభగోదయస్తుతిలోని 18వ శ్లోకంలో గౌడపాదులవారు
సూర్యమండలమధ్యస్థాం దెపేం త్రిపురసుందరం ౹
పాశాంకుశ ధనుర్భణాన్ ధారయంతీం ప్రపూజయేత్ ॥
సూర్యమండలము మధ్యన తన నాలుగు చేతులయందు పాశము, అంకుశము, ధనుస్సు, బాణములు ధరించినటువంటి త్రిపురసుందరిని అర్చించాలి అన్నారు. కాళిదాసు శ్యామలాదండకంలో
చతుర్భ్ఫుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుంద్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
అన్నాడు. ఆ దేవి నాలుగుచేతులతో ప్రకాశిస్తున్నది అని అర్ధం. శంకర భగవత్సాదులవారు తమ సౌందర్య లహరి లోని 7వ శ్లోకంలో
కళానాదో బిందుః క్రమశః ఇహవర్జాశ్చ చరణం
షడజ్జం చాధార ప్రభృతిక మమీషాం మిలనమ్
తదేవం షోడైక్యం భవతి ఖలు యేషాం సమయినాం
చతుర్థైక్యం తేషాం భవతి హి సపర్యా సమయినామ్
కళ, నాదము, బిందువు, చరణము (శ్రీచక్రము) వర్ణములు, షట్బక్రాలను కలపటమే షడ్విధైక్యము అన్నారు.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below