లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0008 ఎనిమదవ నామం : రాగ స్వరూప పాశాఢ్యా
రాగ స్వరూప పాశాఢ్యా : రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లికి నమస్కారము.
Raagha Swaroopa Paashaadyaa : She who has loves rope in her left hand. salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0008 ఎనిమదవ నామం : రాగ స్వరూప పాశాఢ్యా
రాగ స్వరూప పాశాఢ్యా : రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లికి నమస్కారము.
Raagha Swaroopa Paashaadyaa : She who has loves rope in her left hand. salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఎనిమిదవ నామం : రాగ స్వరూప పాశాఢ్యా
"ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః"
పాశం అంటే తాడు. అమ్మవారి చేతిలో పాశం ఉంటుంది. అది మామూలు పాశం కాదు. ఆతల్లి అనురాగం అనగా ప్రేమాస్వరూపం ఈపాశంతో ఎవరినైనా కట్టిపడేస్తుంది అమ్మవారు. అమ్మను బంధించే శక్తి ఎవ్వరికీ లేదు. కానీ అమ్మను ప్రేమ భక్తితో ఏభక్తుడైనా వశం చేసుకోవచ్చు. యశోద ప్రేమభక్తితో శ్రీకృష్ణుడిని బంధించినట్లుగా మనం కూడా ఆ తల్లిని మన హృదయ మందిరంలో కట్టిపడవేయడానికి ఈనామం సరైన సాధనం. అనురాగస్వరూపయైన పాశాన్ని అమ్మవారు ఎందుకు ధరించింది అనే అనుమానం రావడం సహజం. ప్రేమ లేకపోతె సృష్టి లేదు. తల్లిదండ్రులను, బంధువులను, తోటివారిని ఎలా చూడాలో అలా చూడండి. అదే నా చేతిలోని పాశం చేసేపని అంటున్నది అమ్మ. కావున కామ క్రోధాది విషయం వాసనలతో పడి కొట్టుమిట్టాడే వాడిని నాపాశం బంధించి నాదగ్గరలో తీసుకొని వారిని సరైన మార్గంలో పెడతాను అని చెప్పడానికి శ్రీలలితామాత పాషాధారణ చేసింది. ఈ పాశం అమ్మవారి ఇఛ్చాశక్తి.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః"
ఈమంత్రాన్ని భక్తితో నిత్యం 11 సార్లు జపం చేస్తే తల్లిదండ్రులపై ప్రేమ ఏర్పడుతుంది. పిల్లలు తమను ప్రేమించాలని కోరుకునే తల్లిదండ్రులు 81రోజులపాటు ఈమంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చేయాలి. అమ్మవారి పటానికి ఆవుపాలు నైవేద్యం పెట్టి వాటిని జపం అయ్యాక తీర్థంగా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అనురాగానికి సంవత్సర కాలం ఈమంత్రాన్ని రోజుకు 27 సార్లు జపం చేయాలని అగస్త్య సంహితలో ఉన్నది. శ్రద్ధను బట్టి ఈమంత్ర ఫలితం ఉంటుందని గ్రహించండి. ఇఛ్చాశక్తి అనగా అమ్మవారి సంకల్ప పాశం. అవ్వడం వలన రాత్రిపూట 9 నుండి 10 గంటల మధ్యలో ఈ మంత్రానుష్ఠానం చేసేవారికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇఛ్చాశక్తికి రాత్రి మూల స్వరూపం అని తంత్ర శాస్త్రం చెబుతుంది
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read తొమ్మిదవ నామం : కోధాకారాంకుశోజ్ఞ్వలా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత