లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0006 ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
ఉద్యత్ భాను సహస్రాభా : వేయిమంది ఉదయ సూర్యుల వలె ప్రకాశించు తల్లికి నమస్కారము.
Udyath Bhaanu Sahasraabhaa : She who glistens like thousand rising suns. salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0006 ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
ఉద్యత్ భాను సహస్రాభా : వేయిమంది ఉదయ సూర్యుల వలె ప్రకాశించు తల్లికి నమస్కారము.
Udyath Bhaanu Sahasraabhaa : She who glistens like thousand rising suns. salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
"ఓం ఉద్యద్భానుసహస్రభాయై నమః"
అమ్మవారు కాంతి స్వరూపిణి. ప్రకాశమే అమ్మ. అది సాధారణ కాంతి కాదు. ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతి అని మంత్రార్థం. ఇక్కడ సహస్రం అంటే లౌకికర్థమైన వేయి కాదు. అనంతం అని అర్థం. లెక్కలేనంతమంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ అరుణ కాంతి త్రిమూర్తులు కూడా చూడలేరని బ్రహ్మాండపురాణం అంటుంది. అంతటి మహాకాంతి స్వరూపిణి అయిన అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి దివ్యనేత్రాలు ప్రసాదిస్తేనే ఎవ్వరైనా దర్శించగలరు. ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులకు చూడగలిగే శక్తిని అమ్మ ఇస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్రదృష్టి బావుంటుందని అంధత్వాన్ని రానివ్వదని ఆదిశంకరులు అన్నారు.
మంత్రప్రయోగం ఫలితం
కంటిచూపు బాగాలేనివారు 50 రోజులపాటు ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున సూర్యోదయ కాలంలో జపిస్తే చూపు బాగుపడుతుంది. రేచీకటి ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈమంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున సంవత్సరకాలం జపం చేస్తే రేచీకటి తొలగిపోతుందని వామకేశ్వర తంత్రం చెబుతున్నది. కొంతమంది కళ్ళకి దృష్టిదోషం ఉంటుంది. దీనినే దిష్టి అంటారు. ఇటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి రోజుకి 27 సార్లు చొప్పున ఒక్క సంవత్సర కాలం ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఇక జీవితంలో మనకి ఇతరుల వల్ల వచ్చే దృష్టి దోషం ఉండదు. పుటుకటి అంధత్వం ఉన్నవాడు కూడా ఈమంత్రాన్ని జపిస్తే వారికీ నేత్రదానం చేసేవారు లభిస్తారని శ్రీవిద్యా రహస్యం చెబుతోంది. నిత్యం 11 సార్లు ఈ మంత్రం జపం చేస్తే చూపు చాలా బావుంటుందని భాస్కర రాయులు చెప్పారు.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read ఏడవ నామం : చతుర్బాహు సమన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత