శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఐదవ నామం : దేవకార్య సముద్యతా
"ఓం దేవకార్య సముద్యతాయై నమః"
అమ్మవారు సర్వకాల సర్వావస్థల యందు భువన బ్రహ్మాండాలన్నిటిలోనూ నిండి ఉన్న చైతన్య స్వరూపమే. అయినప్పటికీ రూపధారణకు ఏదో ఒక కారణం కలిగించుకొని భక్తులకు దర్శనం ఇస్తుంది. లోకంలో అధర్మం పెరిగినపుడు ధర్మసంస్థాపనకు అమ్మ దిగి వస్తుందని బ్రహ్మాండపురాణం చెబుతోంది. ధర్మమే శరీరంగా గలవారు దేవతలని, అధర్మశీలురు రాక్షసులని మహాభారతం అరణ్యపర్వం అంటోంది. అమ్మవారే దేవకార్య సముద్యత అయింది. అనగా ధర్మం సంస్థాపన చేయడానికి ధర్మస్వరూపులైన దేవతలా ప్రార్థన స్వీకరించి అధర్మస్వరూపులైన రాక్షసులను సంహరించడానికి ఆవిర్భవించిందన్నమాట. పాపాత్ములైన శత్రువులు పెరిగి తమ మానాన తమను బ్రతకనివ్వకుండా ఏడిపిస్తున్నప్పుడో లేక వారిని ఎదిరించే శక్తి లేనప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రప్రయోగం ఫలితం
ఓం దేవకార్య సముద్యతాయై నమః
ఈ మంత్రాన్ని 90 రోజుల పాటు శక్తిని అనుసరించి జపం చేస్తే చాలు. జపం చేసేవారికి శత్రువులు మిత్రులుగా మారిపోతారు. సాధారణంగా ఈ మంత్రజపం ఎవ్వరికీ కీడురానివ్వదు. కనుక శత్రుత్వం తొలగిస్తుంది. తప్ప శత్రువులను నాశనం చేయదు. కానీ లోక కంటకులై ప్రజలను మరీ తీవ్రంగా బాధపెట్టేవారిని మాత్రం సర్వనాశనం చేస్తుంది. శత్రుపీడా నివారణకు ప్రశాంతంగా జీవితం గడపడానికి ఈమంత్రం బాగా పనిచేస్తుంది. నిత్యం ఈ మంత్రాన్ని 27 సార్లు జపం చేసేవారికి ఎవరితో బేధం ఉండదు
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation