శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని నాల్గవ నామం : చిదగ్నికుండ సంభూతా
"ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమః"
స్వాయంభువ మనువు కాలంలో అమ్మవారు జ్ఞానం లేక పరబ్రహ్మం అనబడే అగ్నికుండం నుండి పుట్టిందని బ్రహ్మాండపురాణం చెబుతుంది. ఈ అమ్మవారికి ఒకటి ప్రకృతి అనే స్త్రీరూపం, రెండవది ప్రాజాపత్య పురుషుడు అనబడే పురుష రూపాలు ఉన్నాయి. యజ్ఞాలలో పురుషరూపంలో ప్రత్యక్ష సంతానాన్ని ప్రసాదించే పాయస పాత్రనిచ్చే రూపం ఈ రెండవ రూపమే. దశరథునికి పుత్రకామేష్ఠి యాగంలో ప్రత్యక్షమైన రూపం ఇదే. దేవతలకు అంబాయాగం లో దర్శనమిచ్చిన మొదటి రూపం (ప్రకృతి) తన సంకల్పంతో జ్ఞానాగ్ని నుండి పుట్టినది కావడం వలన ఆణువణువూ జ్ఞానంతో నిండి ఉన్న మూర్తి.
"ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః" అంటోంది వేదం. అనగా నఖశిఖ పర్యంతం అమ్మవారు సువర్ణ మూర్తి. సు అంటే మంచి, వర్ణం అంటే అక్షరం - అమ్మవారు పరమ పవిత్రమైన అక్షర స్వరూపిణి. "ఓంకారం అ మొదలుకొని హ వరకు అన్ని అక్షరాలు అమ్మవారే". ఈనామం చాలా శక్తివంతమైన నామం.
మంత్రప్రయోగం ఫలితం
ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమః
అనబడే ఈ మంత్రాన్ని నిత్యం 27 సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది. తెలివితేటలూ పెరుగుతాయి. ఈ మంత్రాన్ని 5 లక్షలసార్లు తన జీవితంలో జపిస్తే సప్తర్షుల స్థాయికి చేరుతాడు. చిన్నపిల్లలకు ఈమంత్రం ఉపదేశం చేసి వారిచేత రోజుకి 108 సార్లు 41 రోజులు జపం చేయిస్తే గొప్ప విద్యావంతులు అవుతారు. జ్ఞాపకశక్తి బొత్తిగా లేనివారిని 90 రోజులు రోజుకి 108 సార్లు చేయమనండి. ఆపై అసాధారణ ధారణ రాకపోతే అడగండి అంటారు మార్కండేయ మహర్షి. విజ్ఞానాభివృద్ధిని పెంపొందించే మంత్రం కూడా
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read ఐదవ నామం : దేవకార్య సముద్యతా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation