శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని మూడవ నామం : శ్రీమత్ సింహాసనేశ్వరీ
"ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః"
అమ్మవారు సకల లోకాలను పరిపాలించే సామర్ధ్యం గలది. లోకపాలన చేసేవారు ఉన్నత ఆసనంపై కూర్చోవాలి. అమ్మవారు సకల శుభాలకు నిలయమైన, పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోకపాలన చేస్తుంది. ఆ ఆసనాన్ని శ్రీమత్ సింహాసనం అంటారు. అదే ఆసనం అమ్మవారు యుద్దానికి వెళ్ళేటప్పుడు సింహరూపంలో దర్శనమిస్తుంది. ఆ సింహాసనానికి కనుక అమ్మను శ్రీమత్ సింహాసనేశ్వరిగా అభివర్ణిస్తున్నది వేదం. ఆ సింహానికి మరొక గొప్ప లక్షణం ఉంది. మనలో ఉన్న ఇంద్రియాలు అనే మదపుటేనుగులు కట్టుతప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టె శక్తి కలిగి ఉండడం అన్నమాట. ఇటువంటి సింహాసనాన్ని అధిష్టించిన అమ్మవారిని "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః" అనే నామ మంత్రంతో జపం చేసి మెప్పిస్తే శుభాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ప్రమోషన్లు కలగాలంటే ఈ మంత్రాన్ని 60రోజులు ఉదయం 108 సార్లు జపం చేయాలి.
మంత్రప్రయోగం ఫలితం
అనుకోకుండా పదవులు ఊడిపోయినవారు ఉద్యోగాలు కోల్పోయినవారు రోజూ మూడుపూటలా ఈ మంత్రాన్ని 108సార్లు చొప్పున 41రోజులు జపం చేసి అమ్మవారికి ఆవుపాలు నివేదన చేస్తే తిరిగి పదవులు ఉద్యోగాలు లభిస్తాయి. మనపై అధికారులు లేక ప్రభుత్వం కటాక్షం కావాలనుకున్నవారు 90రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట 108సార్లు జపం చేస్తే పని సఫలం అవుతుంది. సకలలోకేశ్వరి లోకానియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమి కోరకుండా ఈమంత్రాన్ని జపిస్తే అమ్మవారి సన్నిధానం కలుగుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read నాల్గవ నామం : చిదగ్నికుండ సంభూతా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation