శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని రెండవ నామం : శ్రీమహారాజ్ఞీ
"ఓం శ్రీ మహారాజ్ఞ్య నమః"
సమస్త లోకాలను పాలించే గొప్ప రాణి అమ్మవారు. ప్రజలను పాలించేవారందరికీ అమ్మవారే పాలకురాలు. అమ్మవారి కాలికింద ఉండే కొంచెం ధూళిని తలపై రాసుకొని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. విష్ణువు పరిపాలకుడయ్యాడు. రుద్రుడు సంహారకుడయ్యాడు. దిక్పాలకులకు పదవులు ప్రసాదించింది అమ్మవారే. ఆ అమ్మవారికి సంబందించిన "ఓం శ్రీ మహారాజ్ఞ్య నమః" అనబడే ఈమంత్రాన్ని జపిస్తే మంచిది.
మంత్రప్రయోగం ఫలితం
81రోజులపాటు భక్తిశ్రద్దలతో ఉదయం 8గంటలోపు జపిస్తే ,మంచి పదవి లభిస్తుంది. 81రోజులపాటు దర్భాసనంపై కూర్చొని 108 సార్లు జపించాలి. ఊరుదాటి వెళ్ళరాదు. ఆలా నియమంతో జపిస్తే మహాపదవి లభిస్తుంది. 27రోజులు రోజుకి 1008 సార్లు సూర్యోదయ లేక సూర్యాస్తమయ సమయాల్లో సూర్యునికి ఎదురుగ నిలబడి జపిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ 27రోజులు శాఖాహారం ఒంటిపూట స్వీకరించాలి. రాత్రికి ఫలహారం చేయవచ్చు. 41రోజులు జపిస్తే మంచిది. అమ్మవారికి జపం పూర్తయ్యాక బెల్లం నివేదించాలి. ఇంట్లో తమ మాటలు ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడేవారు నిత్యం 27సార్లు దీనిని జపిస్తే చాలు అందరూ అనుకూలంగా అవుతారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read మూడవ నామం : శ్రీమత్ సింహాసనేశ్వరీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation