శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని రెండవ నామం : శ్రీమహారాజ్ఞీ
"ఓం శ్రీ మహారాజ్ఞ్య నమః"
భాష్యం
మానవులలో శ్రేష్టుడు, మానవులను రక్షించేవాడు, భూమిని పాలించేవాడు, నరులకు అధిపతి, రాజు, పృథ్వీపతి. రాజులలో కెల్లా శ్రేష్టుడు మహారాజు. అలాగే లోకాలను పాలించునది మహారాణి. మహారాజ్జి, ఇక్కడ మహారాజ్ఞి అనే పదానికి శ్రీ అనే విశేషణం కూడా వాడటం జరిగింది. శ్రీ అంటే - శ్రేష్టమైనది. రాజులలోకి శ్రేష్టమైనవాడు మహారాజు. మహారాజులలోకి శ్రేష్టమైన వాడు లేదా మహారాణులలోకి శ్రేష్టమైనది అంటే అంతకన్న ఎక్కువైన వారుగాని, అధికులుగాని లేనటువంటిది. ఉత్తమమైన పాలకురాలు. పాలకులందరిలోకీ ఉత్తమోత్తమమైనది.
దేవీభాగవతంలో పరమేశ్వరి ఉండే మణిద్వీపాన్ని వివరిస్తూ “చింతామణి గృహంలో వేయిస్తంభాలు కలిగిన మంటపాలు నాలుగు ఉంటాయి.
సహస్రస్తంభసంయుక్తా శ్చత్వార ప్తే ఘమంటపాః ॥
శృంగారమంటప శ్రైకో । ముక్తిమంటప ఏవ చ
జ్ఞానమంటపసంజ్ఞ స్తు ! తృతీయః పరికీర్తితః ॥
ఏకాంతమంటప శ్చైవ ! చతుర్ధః పరికీర్తితః
1. శృంగార మండపము 2. జ్ఞాన మండపము
3. ముక్తి మండపము 4. ఏకాంత మండపము
ఇవన్నీ కూడా పరిమళాలతోను, ధూపాలతోను విరాజిల్లుతుంటాయి.
శృంగారమంటపే దేవ్యో గాయంతీ వివిధైస్వరైః !
సభాసదో దేవవరా మధ్యే శ్రీ జగదంచికా ॥
శృంగార మంటపంలో దేవతలు మధురస్వరాలతో గానం చేస్తుంటారు. అక్కడ సభాసదులైన దేవతల మధ్యన సింహాసనం మీద ఆ జగదంబ ఉంటుంది.
ముక్తిమంటప ? మధ్యే తు యోచయత్య నిశం శివా
జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమంటపే |
చతుర్థే మంటపే చైవ జగడ్రక్షా వివించనమ్ ।
మంత్రిణీసహితా నిత్యం కరోతి జగదంబికా ॥
ముక్తిమంటపం నుంచి ఆ దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞానమంటపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది. నాల్గవ మంటపంలో ఆ పరమేశ్వరి తన మంత్రులతో కొలువుదీరి లోకాల యొక్క రక్షణను గూర్చి ఆలోచిస్తుంటుంది.
ఈ రకంగా అన్నిరకాల పనులను చేస్తూ ఎల్లప్పుడూ లోకాలను రక్షించాలి అనే
కోరిక గల పాలకురాలు శ్రీ మహారాజ్ఞి అనిగాక ఇంకేమని పిలువబడుతుంది ?
శ్రీ అనే బీజం షోడశీ కళను సూచిస్తుంది.
కామరాజ ? మంత్రాంతే శ్రీబీజేన సమన్వితా
షోడశాక్షరీవి ద్యేయం శ్రీ విడ్యేతి ప్రకీర్తితా |
పంచదశి మహామంత్రము అంటే పదిహేను అక్షరాలు గలది. ఆ మంత్రాన్ని భూలోకానికి తెచ్చినవాడు మన్మథుడు. అందుచేత అది కామరాజమంత్రము అనబడుతుంది. షోడశి అంటే పదహారు అక్షరాలు గల మంత్రం. ఈ రెండూ కూడా శ్రీవిద్యలోని మంత్రాలే. ఐతే కామరాజమంత్రమయిన పంచదశి మహామంత్రానికి షోడశీకళను సూచించే శ్రీ అనే బీజాన్ని గనక కలిపినటైతే అది షోడశి మహామంత్రం అవుతుంది.
శ్రీ మహారాజ్జీ అనే పదాన్ని శ్రీం అహారాజ్జీ అని గనక విడదీసినట్లైతే, శ్రీం అనేది షోడశీకళ అవుతుంది. ఇక్కడ అకారము ప్రకాశాంశ పరమేశ్వరస్వరూపము. హ కారము విమర్భాంశ పరమేశ్వరి స్వరూపము. కాగా రాజ్జీ అనేది మహారాజ్జీ మంత్రమైన పంచాక్షరిగా చెప్పబడుతోంది.
యాని జాతాని జీవంతి. ప్రభవించిన వానిని పాలించునది. లోకాలు సజావుగా నడవటానికి ఉన్నవి మూడు శక్తులు. లేదా మూడు కార్యాలు. అవే సృష్టి స్థితి లయాలు. వీటిలో రెండవది లోకాలను పాలించేటటువంటి స్థితిశక్తి. సర్వజగాలను పరిపాలిచేటటు వంటి విష్ణుశక్తి. మహాసామ్రాజ్యలక్ష్మి. భువనేశ్వరీ స్వరూపిణి. మహత్తులలో మహత్తు అయిన ఆత్మ స్వయంప్రకాశము గలది. అంటే ఏ విధమైన సాయము లేకుండానే ప్రకాశించేది. తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపచేసేది. అంతరంగంలో బుద్ధిని ప్రకాశింపచేసేది. అటువంటి పప్రకాశశక్తియే మహారాజ్ఞి అనబడుతున్నది.
ఈ ప్రపంచంలో నవగ్రహాలు పంచభూతాలు, తన్మాత్రలు, దిక్పాలకులు గతులు తప్పకుండా ఎవరి ధర్మాలు వారు నెరవేరుస్తున్నారు అంటే, ఆ రకంగా వాళ్ళని పాలించటం సామాన్యమైన విషయం కాదు. ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది కాబట్టే ఆ పరమేశ్వరి శ్రీ మహారాజ్ఞి అనబడుతున్నది. ఉపని షత్తులలో చెప్పినట్లుగా పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే గాలి సక్రమంగా వీస్తోంది. ఎండలు సరిగా కాస్తున్నాయి. పంచభూతాలు వాటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. దిక్పాలకులు దిక్కులను సరిగా పాలిస్తున్నారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరి. కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది.
ఒకసారి దేవదానవ సంగ్రామం మహాభీకరంగా జరిగింది. అందులో దేవతలు విజయం సాధించారు. ఆ విజయం తమవల్లనే సాధించబడింది అని, ఆ విజయానికి కారణం తామేననీ దేవతలలో ప్రతివారూ గర్వంతో విర్రవీగి పోసాగారు. దీనికంతటికీ కారణమైన పరబ్రహ్మను మరిచిపోయారు. విజయోత్సాహంతో దేవతలంతా సభ తీర్చారు. అందులో ఎవరి ప్రతాపాన్ని వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ముందుగా అగ్నిదేవుడు తాను అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంటే, రాక్షసులందరూ ఆ అగ్నికీలలలోపడి మలమలమాడి భస్మమైపోయారు. అందుచేతనే రాక్షసుల మీద విజయం సాధించటం తేలిక అయింది అన్నాడు. వాయుదేవుడు లేచి తాను చండప్రచండంగా గాలులు వీస్తుంటే
వాటికి తట్టుకోలేక రాక్షసులు ఎండుటాకుల్లాగా ఎగిరిపోయారు. అందుచేతనే విజయం తేలిక అయింది అన్నాడు. ఈ రకంగా దేవతలంతా తమపరాక్రమాన్ని గురించి వివరిస్తున్నారు.
బ్రహ్మతత్త్వం ఇదంతా గమనిస్తోంది. జ్ఞానులైన దేవతలు కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు. వారి అహంకారాన్ని పోగొట్టాలి అనుకున్నది అనుకున్నదే తడవుగా వారి ఎదురుగా భయంకరమైన యక్షరూపంలో ప్రత్యక్షమైంది. చూశారు దేవతలు. ఆ రూపం ఏమిటో వారికి అర్ధంకాలేదు. ఆ రూపాన్ని చూసి భయపడ్డారు. ఏంచెయ్యాలో పాలుపోలేదు వారికి. భయంకరమైన యుద్ధంలో రాక్షసులను తన అగ్నిజ్వాలలతో కాల్చివేశానని చెప్పినవాడు అగ్నిదేవుడు. అందుకని దేవతలంతా అగ్నిని సమీపించి “ఓ అగ్నిదేవా ! నువ్వు వెళ్ళి ఆ భయంకరమైన తత్త్వం ఏమిటో తెలుసుకుని రా” అన్నారు. సరే అని బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ తత్వాన్ని సమీపించాడు. భూతం లాంటి ఆ తత్త్వం
అగ్చిదేవుణ్ణి చూసి అడిగింది “ఎవరు నువ్వు ?” “నేను అగ్నిదేవుడను. లోకంలో అందరూ నన్ను జాతవేదుడు అంటారు” అన్నాడు అగ్ని
“అయితే నీ శక్తి ఏమిటి ?”
“లోకంలో ఏ వస్తువునైనా సరే క్షణంలో కాల్చి బూడిద చేస్తాను”.
“అంత గొప్పవాడివా ? అయితే ఈ గడ్డిపోచను దగ్ధం చెయ్యి”. అంటూ ఒక గడ్డిపరకను అక్కడ ఉంచింది ఆ తత్త్వం. ఆ గడ్డిపరకను చూసి చాలా తేలిక భావంతో మంటలు సృష్టించాడు అగ్నిదేవుడు.
గడ్డిపరక కాలలేదు. భయంకరమైన అగ్నిశిఖలు సృష్టించాడు. లాభం లేకపోయింది. అగ్బిదేవుడు వెనక్కి తిరిగి దేవతలవద్దకు వెళ్ళి “ఆ తత్త్వం ఏమిటో నాకూపాలుపోలేదు” అన్చాడు. అప్పుడు దేవతలంతా వాయువును సమీపించి “దేవా ! నువ్వు చాలా గొప్పవాడివి కదా ! ఆ తత్త్వము ఏమిటో తెలుసుకునిరా” అన్నారు. సరే అని బయలుదేరాడు వాయువు, ఆ తత్వాన్ని సమీపించాడు. పూర్వంలాగానే ఆ తత్త్వం అడిగింది.
“ఎవరు నువ్వు”
“నేను వాయుదేవుడను. ఆకాశంలో సంచరిస్తుంటాను. కాబట్టి నన్ను 'మాతరిశ్వుడు”
అంటారు”.
“నీ శక్తి ఏమిటి ?”
“లోకంలో ఏ వస్తువునైనా సరేనా యొక్క గాలులతో ఎగరగొట్టగలను”.
“అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు” అంటూ ఇదివరకటి గడ్డిపరకనే చూపించింది ఆ తత్త్వం. వాయుదేవుడు తన బలాన్నంతా కూడదీసుకుని భయంకరమైన గాలులు వీచాడు. గడ్డి పోచ కదలలేదు. వచ్చినదారినే వెనక్కువెళ్ళి దేవతలతో” ఆ తత్త్వం ఏమిటో నాకు అర్ధంకాలేదు” అన్నాడు.
అప్పుడు దేవతలందరూ తమ ప్రభువైన ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి అతనికి జరిగిన సంగతంతా వివరించి “దేవేంద్రా ! ఆ విచిత్రమైన తత్త్వం ఏమిటో నువ్వైనా కనుక్కోవలసింది” అన్నారు. సరే అంటూ బయలుదేరాడు ఇంద్రుడు. ఆ తత్వాన్ని సమీపించాడు. అప్పుడు అక్కడున్న తత్త్వం మాయమై పోయింది. దానిస్థానంలో మహాసౌందర్యరాశి అయిన ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె హిమవంతుని కుమార్తె హైమవతి. ఆమెను ఉమాదేవి అని కూడా అంటారు.
ఆశ్చర్యంగా చూశాడు ఇంద్రుడు. “అమ్మా ! దేవతలనందరినీ భయభ్రాంతులను
చేసిన ఆ తత్త్వం ఏమిటి ?” అన్నాడు.
“ ఆ శక్తియే బ్రహ్మము నాకు బ్రహ్మకూ తేడా లేదు. ఇద్దరమూ ఒక్కటే” అని ఉమాదేవి సమాధానం చెప్పింది. ఆ తరువాత “ఓ దేవేంద్రా ! పరబ్రహ్మ వల్లనే మీరు అసురుల మీద విజయం పొందారు. మీ గొప్పతనానికి కారణము బ్రహ్మము. మీ అల్పబుద్ధి వల్ల మీకు కనిపించిన బ్రహ్మాన్ని గుర్తించ లేకపోయారు.” అని చెప్పింది.
నిరాకారుడు నిర్లుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ ఒక ఆకారం పొందితే, అదే పరమేశ్వరి. బిందురూపుడైన పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తే పరమేశ్వరి. శక్తి త్రికోణాకారంగా ఉంటుంది. అదే యోని. దాని నుంచే జగత్తంతా ఆవిర్భవించింది. అదే శ్రీచక్రంలోని త్రికోణము. పరమేశ్వరుని వల్లనే ఈ జగత్తు పప్రవర్తిల్లుతున్నది. పరమేశ్వరునికి ప్రతిరూపం పరమేశ్వరి. అందుచేతనే ఆమె శ్రీమహారాజ్జీ.
చరాచరజగత్తులోని ప్రాణికోటికంతటికీ యుక్తాయుక్తవిచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
వారి కర్మలననుసరించి భవిష్యజ్ఞన్మలు ప్రసాదిస్తుంది. మానవులు చేసే పాపపుణ్యాలు
విచారించటానికి లౌకికన్యాయస్థానాలు చాలవు. వీటిని విచారించటం ఆ పరమేశ్వరునికే సాధ్యపడుతుంది. ఈ రకంగా వారి పాపపుణ్యాలను విచారించి వారికి మరుజన్మ ప్రసాదించి,
ధర్మాన్ని లోకాలను రక్షిస్తుంది కాబట్టే ఆవిడ శ్రీమహారాజ్జీ అని పిలువబడుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా సహస్ర నామ రహస్య అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below