లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0001 ఒకటవ నామం : శ్రీ మాత
శ్రీమాతా : లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
Shree Maatha : Salute to the mother who gives immeasurable wealth. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0001 ఒకటవ నామం : శ్రీ మాత
శ్రీమాతా : లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
Shree Maatha : Salute to the mother who gives immeasurable wealth. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం : శ్రీమాత
"ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః"
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం శ్రీమాత అనగా "శ్రీ అనగా సేవించుట అని అర్ధం. తనను సేవించువారిని తాను సేవిస్తుంది. అందుకే అమ్మవారిని "శ్రీమాత" అన్నారు. శ్రీ అంటే లక్ష్మి, భూదేవి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలు ఉన్నాయి. మాత అంటే కన్నతల్లి. అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి. కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు.
ఐం - అనేది వాక్కును ఇచ్చే బీజం. ఇది సారస్వత బీజం అనికూడా పిలువబడుతుంది.
హ్రీం - భువనేశ్వరి బీజం.
శ్రీం - ఐశ్వర్య బీజం.
వీటిని కలిపి శ్రీమాత అనే అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః" అనే మంత్రంగా జపిస్తే దుఃఖ నాశనమని వామకేశ్వర తంత్రంలో చెప్పబడింది. పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లలను బాధపెడుతున్నప్పుడు పొరుగింటివారి వలన మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రజపం వలన తొలగుతుంది.
మంత్రప్రయోగం ఫలితం
41 రోజులపాటు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనం ఇచ్చేటప్పుడు ఈమంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించి, పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే పైన పేర్కొన్న దుఃఖాలు తొలగిపోతాయి. సంపదలు లభిస్తాయి. కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది. దీనిని ఎవరైనా జపం చేయవచ్చు. ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవడానికి గురువు ద్వారా ఉపదేశం పొందితే మంచిది. ఈమంత్రాన్ని ఒక సంవత్సర కాలం జపిస్తే చక్కటి సంతానం కలుగుతుంది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read రెండవ నామం : శ్రీ మహారాజ్ఞీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత