లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0001 ఒకటవ నామం : శ్రీ మాత
శ్రీమాతా : లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
Shree Maatha : Salute to the mother who gives immeasurable wealth. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0001 ఒకటవ నామం : శ్రీ మాత
శ్రీమాతా : లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
Shree Maatha : Salute to the mother who gives immeasurable wealth. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం : శ్రీమాత
"ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః"
భాష్యం
ఈ లోకంలో ఏ ప్రాణి అయినాసరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా ! అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం. జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నింటిలోకి దుర్లభమైనది మానవజన్మ. ఎన్నో వేల జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవజన్మ వస్తుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలుంటాయి. ఆహార నిద్రా మైధునాలు అన్నిటికీ సమానమే. కాని మానవులకు మనస్సు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు. అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. పాపపుణ్యాల యోచన ఉంటుంది. ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నోవేలసార్లు జన్మ
ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది. ఈ లోగా కొన్ని లక్షల సార్లు పుట్టటం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు. కాని తల్లిలేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతివారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు ? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా ? తాపత్రయాలు పొగొట్టగలుగుతుందా ?
తాపత్రయాలు మూడురకాలు అవి.
1. ఆధి భౌతికము : తనకన్న ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట.
2. ఆధి దైవికము : ప్రకృతి సిద్ధమైన వాటివలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదము, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి.
3. ఆధ్యాత్మికము : తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట. అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి.
బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ
తల్లి అంటే ఎవరు ?
అమ్మల గన్నయమ్మ ముగు రమ్మల మూలపుటమ్మ
తల్లులకే తల్లియైనటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది. ఆవిడే పరమేశ్వరి. జగన్మాత పరాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి. దయాసముద్రురాలు. అందుకే అమ్మా ! అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి ? శ్రీ అనేది గౌరవ వాచకము. విశేషణము. గొప్పదయిన అని అర్ధం. శ్రీయనలక్ష్మి, శ్రీయనగారి, శ్రీయనసరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్ధం కాబట్టి ఈ ముగ్గురికీ మూలస్వరూపురాలయినది. ఆమెయే సదాశివుని అర్థాంగి పరాశక్తి.
దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరతారు. అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు “తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మవా ? నీ తత్త్వాన్ని మాకు వివరించవలసింది” అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది. “నీటిలోని చల్లదానాన్ని నేనే. అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును, చంద్రునిలోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీలేదు. అంతదాకా ఎందుకు ? మీ ముగ్గురూ కూడా నేను లేకుండా ఏ పనీ చెయ్యలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు లోకాలను రక్షిస్తాడు. రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీలేదు. చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను” అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి.
ఆమె లేకుండా ఏ పనీ జరగదు. అందుకే శంకరభగవత్సాదులవారు సౌందర్యలహరిలోని
మొదటి శ్లోకంలో
శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
నచేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి
అత స్త్వా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి ?
ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడగు శివుడు జగన్పిర్మాణశక్తివైన నీతో కూడిననే ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడౌతాడు. అలాకాకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. కాబట్టి హరిహర ట్రహ్మాదులచే పూజించుటకుగాని నీకు నమస్కరించటానికిగాని పూర్వపుణ్యము ఉండాలి కదా? అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారిచేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది.
మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీభాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ “ఉపాధి భేదంవల్ల రెండు విధాలయినట్లుగా, అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియాసమయంలో భిన్నంగా కనిపించినా పరమావస్థ యందు బ్రహ్మపదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టిసమయంలోగాని, లయసమయంలోగాని నాకు స్త్రీపురుష నపుంసక బేధాలు లేవు.” అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు.
శ్రీ అంటే విషము. మాతి అంటే కంఠము నందుంచుకొనినది. గరళమును కంఠము నందు ఉంచుకున్నవాడు. గరళకంఠుడు అన్బప్పుడు పుంలింగము అవుతుంది. మాతా - తల్లి అనే అర్ధంలో స్త్రీలింగమవుతుంది.
ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికిముందు శ్రీ అనే గౌరవవాచకము ఉంచటం జరిగింది. మాత అనే శబ్దము త్రిపురసుందరినే తెలుపుతుంది. హ సక లర డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ మూడు మాత అని చెప్పబడతాయి. ఇక్కడ
హసకలరడైం,హసకలరడీం,హసకలరడౌఃలో చివర అచ్చులు
ఐ ఈ జౌ బాలామంత్రం ఐం క్లీం సౌః ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని
గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన వపంచస్తవాలలో ఒకటయిన
“లఘుస్తవం”లోని 18వ శ్లోక వివరణలో చెప్పారు. ఆ శ్లోకం.
మాయా కుండలినీ క్రియా మధుమతీ కాళీ కలామాలినీ
మాతంగో విజయా జయా భగవతీ దేవీ శివా శాంభవీ
శక్తి శృంకరవల్లభా త్రినయనా వాగ్యాదినీ భైరవీ
ట్రీంకారీ త్రిపురా పరాపరమయీ మాతా కుమారీ త్యపి!॥
స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరివల్ల జన్మిస్తున్నాయో ఆవిడ మాత
ఎవ్వనిచే జనించుజగము ? ఎవ్వనిలోపల నుండు లీనమై ?
ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూలకారణంబెవ్వ డనాది
మధ్యలయుడెవ్వడు సర్వము తానె అయినా వాడెవ్వడు ?
జగత్తులోని లోకాలన్నీ ఎవరియందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో, అంటే సృష్టిస్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర హితుడెవరో, సర్వమూ తానే అయిన వాడెవరో అతడే మాత.
సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు,
భోగభాగ్యాలే కాదు. శ్రీ రూపమయిన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది.
యోబ్రహ్మాణి విధాతిపూర్వం
సృష్టికాలంలో బ్రహ్మదేవుడికి త్రయీవిద్యనుపదేశించింది. త్రయీవిద్య అంటే వేదవిద్య. అవి బుగ్ యజుర్ సామవేదాలు. అంతేకాదు జీవికి ముూక్తిని ప్రసాదిస్తుంది.అందుకే శ్రీమాత అని పిలువ బడుతోంది.
ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృ జ్షేయము అనే మూడు ఉండాలి. అంటే 1. తెలుసుకొనేవాడు. £. తెలుసుకొను శక్తి 8. తెలుసుకొను విషయము. ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, థ్రిభుజానికి అధిదేవత, వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన బాలాత్రిపురసుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనే బిందు వుంటుంది. ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆదేవి బిందుమండలవాసిని అని పిలవబడుతోంది. ఆవిడే శ్రీమాత,
పరమేశ్వరి నిరాకార, నిర్లుణస్వరూప. ఆమెకు రూపంలేదు. కాని జగత్తంతా ఆమె స్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామజాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగు పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెబుతాను. “నాలుగుదిక్కులూ ఆ పరబ్రహ్మ స్వరూపమే” అంటుంది.
రెండవపాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ” భూమి, ఆకాశము, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్ని బ్రహ్మపదార్థంలోని అంతర్భాగాలే” అంటాడు.
మూడవపాదాన్ని ఒక హంస చెబుతూ “
అన్నీ పరబ్రహ్మలోని భాగాలే” అంటుంది.
నాల్లవపాదాన్ని ఒక నీటిపక్షి చెబుతూ “ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం
బ్రహ్మ, మనస్సు బ్రహ్మ” అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వరస్వరూపమే. అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు.
'జగత్తులోని
'అగ్న్ని సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు
దేవీ భాగవతంలోని సప్తమస్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి, శుక్రవారం వేదసమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయింది. ఆ రూపం ఎలా ఉందంటే
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ ॥
విద్యుత్కోటిసమానాభ మరుణం తత్సరం మహః
నైవ చోర్ధ్వం న తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్ ॥
ఆద్యంతరహితం తత్తు న హస్తా ద్యంగ సంయుతమ్
నచ స్రీ రూప మథవా నపుంరూప మధోభయమ్ ॥
కొన్నివేల కోట్ల సూర్యులయొక్క కాంతులతో, కోట్లకొలది చంద్రుల చల్లదనముతో, కొన్నికోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తళుక్కున మెరిసింది. అది కోటి పాగసాగగా అది అరుణారుణకాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవి ఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు
అన్నిరూపులు నీ రూపమైనవాడ !
ఆది మధ్యాంతములు లేక అలరువాడ !
అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ. బిడ్డల కోరికలు తీర్చేది. వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే దుర్వాసుడు తన “శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లో శ్రీమాత స్తిపురే ! పరాత్సరతరే దేవి ! త్రిలోకీ అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ పరమేశ్వరి సర్వులకు మాత లోకాలన్నింటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది. ఈ నామంలో దేవి సృష్టి రూపిణి.
Click & Read లలితా రహస్య నామ అర్ధము మరియు ఫలితము
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below