శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0066 నామం : WIP
"ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమః "
భాష్యం
సంపత్కరీ అనే పేరు గల దేవి ఏనుగులకు అధిపతి. అంటే పరమేశ్వరి యొక్క గజ సైన్యానికి అధిపతి సంపత్కరీదేవి. ఆమె పరమేశ్వరి అంకుశము నుంచి పుట్టింది. సంపత్కరీ దేవి రణకోలాహలము అనే ఏనుగును అధిరోహించి ఉంటుంది. కోట్లకొలది ఏనుగులు ఈమెను అనుసరించి ఉంటాయి. సంపత్కరీదేవికి గజశాస్త్రము గురించి బాగా తెలుసు. ఏనుగులలో సింధురగజము, భద్రగజము, మంద్రగజము, మృగగజము ఇలా అనేకరకాలున్నాయి.
ప్రస్తుతకాలంలో ఏనుగులలో రెండు జాతులున్నాయి. 1. ఎలిఫాస్ 2. లాక్సోడాంటా.
వీటిలో మొత్తం 300 ఉపజాతులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
1. ఉత్తరఅమెరికాలోని మాసోడాన్. దీనికి పెద్దపెద్దరోమాలు ఉండేవి.
2. వూలీమామత్ : ఇది బొచ్చు ఏనుగు. దీని శరీరం అంతా బాగా వెంట్రుకలుంటాయి. దీని చెవులు చిన్నవిగా దంతాలు మెలితిరిగి ఉంటాయి.
౩. ఎలిఫాస్ కొలంబి : దీని దంతాలు బాగా మెలి తిరిగి ఉంటాయి.
4. ఎలిఫాస్ ఇంపొరేటర్ : దీని ఎత్తు 18 అడుగులు. చాలా ఎత్తైన ఏనుగు.
ఏనుగులు ఆఫ్రికాలో కూడా బాగా ఉంటాయి. అక్కడ ఏనుగులు నుంచునే నిద్రపోతాయి. వాటిలో
1. లాక్సోడాంటా : దీని ఎత్తు 11 అడుగులు. దీని చెవులు 8 1/2 అడుగులు వెడల్పు ఉంటాయి. దంతాలు ఆరు అడుగుల పొడవుంటాయి.
2. పిడ్మిఎలిఫెంట్ : ఇదిగున్న ఏనుగు.
౩. వైట్ ఎలిఫెంట్ : ఇది తెల్ల ఏనుగు. బర్మా, సియామ్ ప్రాంతాలలో ఉంటుంది. ఈ రకం ఏనుగులు చాలా తక్కువ. అందుచేత దీన్ని దేవతాస్వరూపముగా భావిస్తారు. దీంతో పనిచేయించరు. శుభశూచకంగా దీన్ని భావిస్తారు. ఇంద్రుని ఐరావతం కూడా తెల్లగానే ఉంటుంది.
ఇక ఆసియాలో కనిపించే ఏనుగులను 'ఎలిఫాస్ మాక్సిమస్” జాతి అంటారు. ఇవి పది అడుగుల ఎత్తుంటాయి. దంతాలు తొమ్మిది అడుగులదాకా ఉంటాయి. ఇవి పడుకుని నిద్రపోతాయి. సిలన్లోని ఏనుగులకు దంతాలుండవు.
వీటిలో యుద్ధాలలో ఉపయోగించే ఏనుగును సింధురగజము అంటారు.
సుఖసంపదలతో కూడిన మనోవ్యాపారమే సంపత్కరి. సుఖసంపదలతో కూడిన చిత్తవృత్తులు సంపత్కరీ సంజ్ఞగలవి. మనస్సు అనబడే పరమేశ్వరి ఈ చిత్త వృత్తులను అధిరోహించి శబ్దాదివిషయసమూహములను గజములచే సేవించబడుచున్నది.
మనసును ముఖ్య ప్రాణంతో లయంచేసి తురీయస్థితిని చెంది ఉండటమే సంపత్కరీవిద్య. సామాన్యులు చిత్తవృత్తిచేత అప్పుడు కనిపించే పదార్థాలను చూడగలరు. కాని ఆత్మచైతన్యము పొందటమనేది యోగులకే సాధ్యము.
యోగులచిత్తవృత్తి అంతర్ముఖమైనప్పుడు, అఖండాకారవృత్తి జ్ఞానముతో ఐక్యమవుతుంది. చిత్తవృత్తి నాశనం అయితే మాయనశించినట్లే. అప్పుడు జగత్తంతా నేనే అనే పరిణితి కలుగుతుంది. ఈ జ్ఞానమే ఆ పరాత్పరి.
శ్రీచక్రంలోని త్రికోణంలో ఉండే కామేశ్వరీదేవియే సంపత్కరీదేవి.
మంత్రశాస్త్రంలో సంపత్కరీదేవి అని ఒక దేవత ఉన్నది.
శ్రీమాత్రేనమః
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below