శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0061 నామం : సుధాసాగర మధ్యస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం సుధాసాగరమధ్యస్థాయై నమః"
భాష్యం
సుధాసాగరము - అమృతపు సముద్రము అదే క్షీరసాగరము. ఆ క్షీరసాగరం మధ్యలో దేవి ఉంటుంది.
సుధాబజ్ఞౌ నందనోద్యానే రత్న్మమండప మధ్యమాం ॥
బాలార్మమండలాభాసాం చతుర్భాహుం త్రిలోచనామ్ ॥
క్షీరసాగరం మధ్యన రత్నమండపం మీద నాలుగుచేతులతో ఆ దేవి బాలభానునివలె ప్రకాశిస్తున్నది.
మృతము అంటే చావులేకుండా చేసేది అమృతము. అమృతే నావృతాం పురీం అటువంటి అమృతముచే ఆవరింపబడిన నగరము. సుధాసాగరము అనేవి మూడున్నాయి.
1. క్షీరసాగరము
2. సహస్రారము పైనున్న (బ్రహ్మరంధ్రము అదే బిందుస్థానము. బిందుస్థానం సుధాసింధుః
3. సగుణబ్రహ్మోపాసనచే పొందదగిన మార్గము. సగుణబ్రహ్మోపాసనా ప్రాప్యేనగరే.
ఈ మూడు రకాలయిన సుధాసాగరాల మధ్యన ఉంటుంది ఆ పరమేశ్వరి. ఆమె సుధాసముద్రం మధ్యన ఉంటుంది. కాబట్టే సాధకుడికి చావులేకుండా చేస్తుంది. పుట్టిన ప్రతిప్రాణి మరణించాల్సిందే. మరి చావు లేకపోవటం అంటే జన్మలేకపోవటం అన్నమాట. అదే జన్మరాహిత్యం శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం అంటే సాధకుడికి శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలగచేస్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి మరుజన్మ ఉండదు. సాధకుడు జ్ఞానియై, విజ్ఞానాన్ని ఆర్టించి స్వరూపసిద్ధిని పొంది అంటే తన రూపం ఏమిటి ? తానెక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాలు తెలుసుకుంటాడు. అటువంటి వ్యక్తికి సాయుజ్యం లభిస్తుంది. మోక్షానికి కర్మ, ఉపాసన, జ్ఞానము కూడా సాధనాలే. వీరందరికీ మోక్షం లభిస్తుంది. కాబట్టి దేవి రెండురకాల మోక్షాలను ఇస్తుంది. శ్రీచక్రమే సుధాసముద్రము. అక్కడ ఉన్న అష్టదళపద్మము, షోడశదళపద్మాలే మహాపద్మ్భాటవులు. పంచకోణాలే కడిమిచెట్లు.
సగుణ బ్రహ్మోపాసనవల్ల లభించే లోకంలో “అరి “ణ్య అనే రెండు అమృతపు సరస్సులున్నాయి. వీటినే సుధాసాగరము అంటారు. అర్చిరాది మార్గంలో ప్రయాణంచేసే జీవుడు ఆ సరస్సులలో స్నానం చేస్తేనే అతడికి బ్రహ్మలోక ప్రవేశానికి అర్హత కలుగుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below