శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0041 నామం : ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘికా
"ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః"
భాష్యం
ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు. అవి మాణిక్యాలలాగా ఎర్రని కాంతి కలిగి ఉంటాయి. ఈ పురుగులు వర్షాకాలంలో పుడతాయి. ఈ రకంగా ఆరుద్ర పురుగుల వలె ఎర్రని కాంతులతో ప్రకాశించు మణులతో చెక్కబడిన మన్మథుని అమ్ములపొదులతో సమానమైన కాంతులతో ప్రకాశించు పిక్కలు గలది.
వారుణేన చ జంఘోరునితంబస్తేజసా భువః
పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు వరుణుని తేజస్సుతో పిక్కలు, తొడలు ఏర్పడ్డాయి. ఇంద్రగోపములు అంటే మంత్రవర్ణములు బాణము అంటే మంత్రము. తూణీరము అంటే అమ్ములపొది. అందులో ఇటువంటి బాణ సముదాయముంటుంది. అందుచేత దీన్ని మహామంత్ర సంపుటమైన మహాపాదుక అని భావించాలి.
అస్యశ్రీ శ్రీమహాపాదుకామహామంత్రస్య హంసబుషిః అవ్యక్తా గాయత్రీఛందః
శ్రీమహాగురుపాదుకా దేవతా । హం బీజం । సఃశక్తిః । సో హం కీలకం । జపే
వినియోగః ॥
న్యాసము :
హంసాం సూర్యాత్మనే ॥ హంసైం నిరాభాసాత్మనే ॥
హంసీం సోమాత్మనే । హంసౌం అతనుసూక్ష్మ ప్రబోధాత్మనే।
హంసూం నిరంజనాత్మనే ॥ హంసః అవ్యక్త ప్రబోధాత్మనే ॥
ధ్యానము :
స్వప్రకాశ శివమూర్తిరేకికా
తద్విమర్శ తను రేకికా తయోః ।
సామరస్య వపురిష్యతే పరా
పాదుకా పరశివాత్మనో గురోః ॥
సంచింతయామి చరణా కులరంధ్రపీఠే
శంభోర శేష జనన స్థితినాళహేతూ ॥
షష్ట్యుత్తర త్రిశత దివ్యమరీచికానాం
అంతే పదోపరి షడన్వయ రక్తశుక్లౌ ॥
సహస్రదళ పంకజే సకల శీతరశ్శి ప్రభం
వరాభయ కరాంబుజం విమల గంధమాల్యాంబరమ్ ।
ప్రసన్నవదనేక్షణం సకల దేవతారూపిణం
స్మరేచ్ళిరసి హంసకం తదభిధాన పూర్వం గురుమ్ ॥
వందే గురుపదద్వంద్వ మవాజ్మాన సగోచరం ।
రక్తశుక్ల ప్రభామిశ్ర మతర్మ్యం క్రైపురం మహః ॥
కరంధ్రే హృదయే మూలే దేశికాంఘ్రి యుగత్రయం ।
దధత్రీం దీప్తభూషాధ్యాం శ్రీమహా పాదుకాం భజే ॥
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ ।
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షి భూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ॥
మంత్రము :
షడామ్బాయస్థ మంత్రాణాం సారభూతాం పరాంశివాం ।
ద్వాదశభిర్మహామ త్రైరుచ్చరే ద్లురుపాదుకామ్ ॥
ఇంద్ర - పరమైశ్వర్యము, మోక్షము
గోప - రక్షించునది
స్మర - చింతింపతగిన
జంఘికా - పుట్టుక
ఈ రకంగా చూసినట్లైతే మోక్షమిచ్చి రక్షించు దేవి అని అర్థము.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below