శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0038 నామం : రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితా
"ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః"
భాష్యం
రత్నాలు పొదగబడిన బంగారుగంటలచే అలంకరింపబడిన మొలనూలు గలది.
పూర్వకాలంలో స్రీలు మొలనూలు అనబడే బంగారు మొలత్రాడు ధరించేవారు. అది ఒక ఆభరణం. మొలత్రాడు అనేది లోపల ఉంటుంది. కాని మొలనూలు బయటవైపున అలంకారంగా ఉంటుంది. ఇక ధరించే వారిశక్తిని బట్టి దానిమీద రత్నాలు, ముత్యాలు కెంపులు పొదగబడతాయి. అయితే ప్రస్తుతకాలంలో కూడా ఈ ఆభరణాలు కనిపిస్తున్నాయి.
ఉపనయన కాలంలో వటువు నడుముకు ముంజిగడ్డితో చేసిన త్రాడును కడతారు. అప్పుడు చేసే సంస్కారంవల్ల అతడికి మంత్రోపాసన చేసేందుకు అధికారము వస్తుంది. అలాగే వివాహ సమయంలో పెండ్లికుమార్తెకు ఈ అధికారం వస్తుంది. పరమేశ్వరి ఓంకారము అనేటటువంటి ఈ సూత్రాన్ని ధరించి సదాచారాలను లోకానికి బోధిస్తుంది. ఆమె నాదమయి. ఓంకారాత్మక సూత్రధారిణి ఆ పరాశక్తి.
రతనాలు పొదిగి, చిరుగంటలచే అలంకరించబడిన పదహారు తీగెలు గల మేఘలా సూత్రముచే అలంకరించబడినది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below