Search this site
Embedded Files
Vasthu House
  • Home
  • Consult Us
  • Blog Vasthu House
  • Blog_Chinthamani Gruham
    • Lalitha Sahasra Naamam
  • YouTube
  • Services
    • Vasthu Compliance Online!
    • Vasthu for New Home
    • Residential Vasthu
    • Vasthu for Office
    • Commercial Vasthu
    • Benefits of Industrial Vasthu
    • Online Vasthu Consultation
    • Astrology
    • Numerology
  • Why Choose Us
  • Contact Us
  • Smt. Karnati Vanitha
  • Interiors
  • Case Studies
  • Horoscope Report
  • Our Vasthu Experts
  • FAQ
  • T&C
Vasthu House
  • Home
  • Consult Us
  • Blog Vasthu House
  • Blog_Chinthamani Gruham
    • Lalitha Sahasra Naamam
  • YouTube
  • Services
    • Vasthu Compliance Online!
    • Vasthu for New Home
    • Residential Vasthu
    • Vasthu for Office
    • Commercial Vasthu
    • Benefits of Industrial Vasthu
    • Online Vasthu Consultation
    • Astrology
    • Numerology
  • Why Choose Us
  • Contact Us
  • Smt. Karnati Vanitha
  • Interiors
  • Case Studies
  • Horoscope Report
  • Our Vasthu Experts
  • FAQ
  • T&C
  • More
    • Home
    • Consult Us
    • Blog Vasthu House
    • Blog_Chinthamani Gruham
      • Lalitha Sahasra Naamam
    • YouTube
    • Services
      • Vasthu Compliance Online!
      • Vasthu for New Home
      • Residential Vasthu
      • Vasthu for Office
      • Commercial Vasthu
      • Benefits of Industrial Vasthu
      • Online Vasthu Consultation
      • Astrology
      • Numerology
    • Why Choose Us
    • Contact Us
    • Smt. Karnati Vanitha
    • Interiors
    • Case Studies
    • Horoscope Report
    • Our Vasthu Experts
    • FAQ
    • T&C

కార్తీకపురాణం 26 వ అధ్యాయం

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

కార్తీకపురాణం 26 వ అధ్యాయం

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరిహితబోధ


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము.


శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి.


అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది

● మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును.


● మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును.


● వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును.

● నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును.

● బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును.

● భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును.

● లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును.

● పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను,

● కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును.


నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వి౦శోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.


సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !

- స్వస్తి-


|| ఓం శ్రీమాత్రేనమః ||


కార్తీకపురాణం 27 వ అధ్యాయం...

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

Visit Vasthu House#2-277/1/4/A/1, Opp HSR Sarala Devi Enclave, Meerpet Municipality, Balapur (M), Hyderabad, Telangana 500097. +91 9949588017.
LinkLinkFacebookLinkInstagramLinkLinkLinkLinkLink
Google Sites
Report abuse
Page details
Page updated
Google Sites
Report abuse